News March 25, 2025
ఇటిక్యాల: ఉపాధి హామీ పనులను తనిఖీ చేసిన అదనపు కలెక్టర్

ఇటిక్యాల మండల కేంద్రంలో గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో ఉపాధి హామీ పనులు నిర్వహించారు. జిల్లా అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) నర్సింగరావు ఈరోజు పనులను తనిఖీ చేశారు. ఉపాధి హామీ పథకాన్ని జాబ్ కార్డు ఉన్న ప్రజలు వినియోగించుకోవాలని సూచించారు. ఇటిక్యాల ఎంపీడీవో, ఎర్రవల్లి ఎంపీడీవో, ఇతర ఉన్నతాధికారులు, గ్రామ పంచాయతీ కార్యదర్శి రమేశ్, గ్రామ ప్రజలు, తదితరులు పాల్గొన్నారు.
Similar News
News July 5, 2025
ఈ నెల 15, 16 తేదీల్లో వీఐపీ దర్శనాలు రద్దు

AP: ఈ నెల 15, 16 తేదీల్లో తిరుమల శ్రీవారి వీఐపీ బ్రేక్ దర్శనాలను టీటీడీ రద్దు చేసింది. ఆ రోజుల్లో కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం, ఆణివార ఆస్థానం కార్యక్రమాలు నిర్వహిస్తున్న నేపథ్యంలో రద్దు చేసినట్లు తెలిపింది. అలాగే 14 ,15 తేదీల్లో ప్రొటోకాల్ ప్రముఖులకు మాత్రమే సిఫారసులు స్వీకరిస్తామని స్పష్టం చేసింది. భక్తులు గమనించి టీటీడీకి సహకరించాలని కోరింది.
News July 5, 2025
ఈ శతాబ్దపు అత్యుత్తమ మూవీ ‘పారాసైట్’: న్యూయార్క్ టైమ్స్

ఈ శతాబ్దంలోనే అత్యుత్తమ చిత్రంగా కొరియన్ మూవీ ‘పారాసైట్’ నిలిచింది. న్యూయార్క్ టైమ్స్ ప్రకటించిన 21వ శతాబ్దంలోని టాప్-100 చిత్రాల్లో తొలి స్థానం దక్కించుకుంది. మూన్ లైట్, డార్క్ నైట్, వాల్-ఈ వంటి చిత్రాలతో పోటీ పడటం గమనార్హం. 2019లో రిలీజైన ‘పారాసైట్’కు నాలుగు ఆస్కార్ అవార్డులు వచ్చిన సంగతి తెలిసిందే. ఉత్తమ చిత్రం విభాగంలో అకాడమీ అవార్డు పొందిన నాన్-ఇంగ్లిష్ మూవీ ఇదే. మీరు ఈ మూవీ చూశారా?
News July 5, 2025
సాంకేతిక నైపుణ్యతలు పెంపొందించుకోవాలి: ఎస్పీ

ప్రతి ఒక్కరూ సాంకేతిక నైపుణ్యతను పెంపొందించుకునే విధంగా కృషి చేయాలని స్పెషల్ బ్రాంచ్ సిబ్బందికి శ్రీ సత్యసాయి జిల్లా ఎస్పీ రత్న సూచించారు. శనివారం ఎస్పీ కార్యాలయంలో స్పెషల్ బ్రాంచ్ సిబ్బంది క్షేత్రస్థాయిలో నిర్వహించాల్సిన విధులపై దిశానిర్దేశం చేశారు. ఫ్యాక్షన్ గ్రామాలలో గొడవలు జరగకుండా ఎప్పటికప్పుడు ముందస్తు సమాచారాన్ని జిల్లా అధికారులకు తెలియజేయాలన్నారు. సిబ్బందికి లెదర్ బ్యాగులు పంపిణీ చేశారు.