News February 25, 2025
ఇటిక్యాల: పనుల పురోగతిపై పరిశీలన

ఇటిక్యాల మండల కేంద్రంలోని ఎంపీడీఓ కార్యాలయాన్ని జిల్లా కలెక్టర్ బీఎం సంతోష్ తనిఖీ చేశారు. ప్రభుత్వ పథకాల అమలు తీరు, ఉపాధి హామీ పనులు, రాబోయే వేసవి కాలంలో నీటి ఎద్దడి నివారణకు ముందస్తు చర్యలు తదితర పనులు పరిశీలించారు. అధికారులకు సంబంధిత పనుల పురోగతి గురించి ఆదేశాలు ఇచ్చారు. జిల్లా, మండల అధికారులు, ఉపాధి హామీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
Similar News
News February 25, 2025
సిద్దిపేట: యూనిఫాంలపై అదనపు కలెక్టర్ సమీక్ష

ప్రభుత్వ పాఠశాల, వివిధ రకాల గురుకులాల్లో విద్యను అభ్యసిస్తున్న విద్యార్థులకు వచ్చే అకాడమిక్ సంవత్సరంలో స్కూల్ యూనిఫాం అందజేసేందుకు తీసుకోవాల్సిన చర్యల గూర్చి జిల్లా అదనపు కలెక్టర్ గరిమ ఆగ్రవాల్ సమావేశం నిర్వహించారు. ఈ మేరకు మంగళవారం సమీకృత జిల్లా కార్యాలయ సముదాయంలోని కాన్ఫరెన్స్ హాల్లో జిల్లాలోని అధికారులు సమీక్ష నిర్వహించారు.
News February 25, 2025
విద్యార్థుల కోసం చివరి క్షణాల్లోనూ..!

ఉపాధ్యాయులకు విద్యార్థులే జీవితం. వారి భవిష్యత్తు కోసం చదువు చెప్తూ, ఒక్కోసారి దండిస్తూ తన జీవితాన్నే త్యాగం చేసేందుకు సిద్ధంగా ఉంటారు. అలాంటి ఓ ఉపాధ్యాయుడు చనిపోయే కొన్ని క్షణాల ముందు విద్యార్థుల కోసం ఆస్పత్రి బెడ్‌పై ల్యాప్‌టాప్ పట్టుకొని పనిచేశారు. దీనికి సంబంధించిన ఫొటోను ఉపాధ్యాయుడి కుమార్తె షేర్ చేయగా వైరలవుతోంది. విద్యార్థుల చదువు పట్ల అతని అంకితభావాన్ని అభినందించాల్సిందే.
News February 25, 2025
వనపర్తికి CM రేవంత్ రెడ్డి.. భారీ బందోబస్తు

వనపర్తిలో వివిధ అభివృద్ధి పనుల ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలకు మార్చి 2న సీఎం రేవంత్ రెడ్డి వస్తున్నారు. సీఎం పర్యటనకు పకడ్బందీగా ఏర్పాటు చేయాలని వనపర్తి జిల్లా ఎస్పీ గిరిధర్ పోలీస్ అధికారులను ఆదేశించారు. మంగళవారం జిల్లా కేంద్రంలోని పాలిటెక్నిక్ కళాశాల, హెలిప్యాడ్ ఏర్పాటు చేసే స్థలాలను ఆయన పరిశీలించారు. పబ్లిక్ మీటింగ్‌కు వచ్చే ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు చేయాలని పేర్కొన్నారు.