News September 9, 2025

ఇటిక్యాల: సైబర్ మోసం.. రూ.22 లక్షలు టోకరా

image

లాభాల ఆశ చూపించి ఓ యువకుడిని సైబర్ మోసగాళ్లు నిండా ముంచారు. ఉండవెల్లి మండలం, ఇటిక్యాలపాడుకు చెందిన గౌరెడ్డి వెంకటరెడ్డి, ఆన్‌లైన్ గ్రోయాప్‌లో రూ.50 వేలు పెట్టుబడితో రూ.3 లక్షలు లాభం వస్తుందన్న ప్రకటన చూసి మోసపోయాడు. గత నెల రోజుల వ్యవధిలో దశలవారీగా రూ.22 లక్షలు డిపాజిట్ చేశాడు. ఈ డబ్బును డ్రా చేయాలంటే మరో రూ.13 లక్షలు చెల్లించాలని చెప్పడంతో మోసపోయానని గ్రహించి పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

Similar News

News September 10, 2025

ఆసియా కప్: హాంకాంగ్‌పై అఫ్గాన్ విజయం

image

ఆసియా కప్-2025 తొలి మ్యాచులో హాంకాంగ్‌పై అఫ్గానిస్థాన్ 94 రన్స్ తేడాతో విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన అఫ్గాన్ నిర్ణీత 20 ఓవర్లలో 188/6 స్కోర్ చేసింది. సెదిఖుల్లా అటల్ (73), అజ్మతుల్లా (53) రాణించారు. అనంతరం ఛేదనలో హాంకాంగ్ 20 ఓవర్లలో 94-9 స్కోర్ మాత్రమే చేయగలిగింది. ఆ జట్టు బ్యాటర్లలో బాబర్ హయత్ (39) టాప్ స్కోరర్‌గా నిలిచారు.

News September 10, 2025

జిల్లాలో ఎరువుల కొరత లేదు: కలెక్టర్

image

ఏలూరు జిల్లాలో ఎక్కడా యూరియా, ఎరువుల కొరత లేదని కలెక్టర్ కె. వెట్రిసెల్వి మంగళవారం తెలిపారు. పోలవరం మండలం ప్రగడపల్లి సొసైటీలో 25 మెట్రిక్ టన్నులు, జిల్లెళ్లగూడెం, వింజరం రైతు సేవా కేంద్రాలకు 12.5 మెట్రిక్ టన్నుల చొప్పున ఒక్కరోజులోనే అదనంగా సరఫరా చేశామని చెప్పారు. రైతుల అవసరాలకు అనుగుణంగా ఎరువులు అందిస్తామన్నారు. రైతులు ఆందోళన చెందవద్దని స్పష్టం చేశారు.

News September 10, 2025

నేటి ముఖ్యాంశాలు

image

* ఉపరాష్ట్రపతిగా ఎన్నికైన C.P.రాధాకృష్ణన్
* క్యాన్సర్ డే కేర్ సెంటర్లు ప్రారంభించిన మంత్రి దామోదర
* గ్రూప్-1 మెయిన్స్ ఫలితాలు రద్దు: TG హైకోర్టు
* సీఎంకు, నాకు లై డిటెక్టర్ టెస్ట్ చేయండి: KTR
* 4 దశల్లో ఏపీలో స్థానిక ఎన్నికలు: SEC
* ఏపీలో ఇంటర్ పరీక్షల ఫీజు చెల్లింపునకు షెడ్యూల్ విడుదల
* నేపాల్‌లో ఆర్మీ పాలన.. ప్రధాని రాజీనామా
* నేపాల్ మంత్రులను తరిమికొట్టిన నిరసనకారులు