News March 13, 2025
ఇతరులకు ఇబ్బంది లేకుండా హోలీ జరుపుకోవాలి: ఎస్పీ

హోలీ పండుగను ఇతరులకు ఇబ్బంది కలగకుండా జరుపుకోవాలని బాపట్ల జిల్లా ఎస్పీ తుషార్ డూడి ప్రజలకు సూచించారు. ఈ మేరకు గురువారం ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు. ఎవరైనా అవాంఛనీయ ఘటనలను ప్రేరేపిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా ఎస్పీ హెచ్చరించారు. జిల్లాలో ఎటువంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా జిల్లా వ్యాప్తంగా పటిష్ట బందోబస్తు ఏర్పాట్లు చేసినట్లు వివరించారు.
Similar News
News March 13, 2025
చాహల్‌తో డేటింగ్ రూమర్స్: ఆర్జే మహ్వాష్ పోస్ట్ వైరల్

టీమ్ ఇండియా క్రికెటర్ యజ్వేంద్ర చాహల్‌తో డేటింగ్ రూమర్స్ వేళ ఆర్జే మహ్వాష్ సోషల్ మీడియాలో ఓ పోస్ట్ పెట్టారు. ‘నేను ఈ స్థాయికి రావడం చూసి చిన్ననాటి మహ్వాష్ ఎంతో గర్విస్తోంది. నాకు కావాల్సింది కూడా ఇదే. మనం ఏ తప్పు చేయకుండా, అనవసర విషయాలు పట్టించుకోకుండా మన పని మనం చేసుకుంటూ ముందుకు సాగాలి’ అని పోస్టులో రాశారు. డేటింగ్‌పై వస్తున్న రూమర్స్‌పైనే ఆమె ఈ పోస్ట్ పెట్టినట్లు నెటిజన్లు చర్చించుకుంటున్నారు.
News March 13, 2025
నెల్లూరు: నిరుద్యోగులకు జర్మనీలో ఉద్యోగ అవకాశాలు

ఏపీ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో మెకానికల్, ఎలక్ట్రికల్, ఎనర్జీ సిస్టం, ఇండస్ట్రియల్ ఇంజనీరింగ్‌లో డిగ్రీ, డిప్లమా విద్యార్హత కలిగిన నిరుద్యోగ యువతకు జర్మనీలో ఉద్యోగ అవకాశాలు కలవని ఏపీ స్కిల్ డెవలప్మెంట్ జిల్లా మేనేజర్ అబ్దుల్ ఖయ్యూం తెలిపారు. 18 నుంచి 40 ఏళ్ల వయసు కలిగిన నిరుద్యోగులు అర్హులని అన్నారు. మరింత సమాచారం కోసం కార్యాలయంలో సంప్రదించాలని కోరారు.
News March 13, 2025
అసెంబ్లీ వద్ద ఉద్రిక్తత

తెలంగాణ అసెంబ్లీ ప్రాంగణంలోని అంబేడ్కర్ విగ్రహం వద్ద ఉద్రిక్తత నెలకొంది. జగదీశ్ రెడ్డి సస్పెన్షన్‌పై బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు నిరసనకు దిగారు. దీంతో అక్కడ భారీగా పోలీసులను మోహరించారు. మరోవైపు రేపు రాష్ట్రవ్యాప్త నిరసనకు బీఆర్ఎస్ పిలుపునిచ్చింది. కాంగ్రెస్ దిష్టిబొమ్మలు దహనం చేయాలని ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సూచించారు.