News December 18, 2025
ఇతిహాసాలు క్విజ్ – 100 సమాధానం

ఈరోజు ప్రశ్న: ఏ రాక్షస రాజు తన తపస్సు ద్వారా మహావిష్ణువును మెప్పించి, తన శరీరం అన్ని తీర్థాల కంటే పవిత్రంగా ఉండాలనే వరం పొందాడు? చివరికి విష్ణువు పాదం మోపడం ద్వారా ఆ అసురుడు ఏ పుణ్యక్షేత్రంగా మారాడు?
సమాధానం: రాక్షస రాజు గయాసురుడు తన తపస్సు ద్వారా విష్ణువును మెప్పించాడు. ఆయన శరీరంపై విష్ణువు పాదం మోపడం వలన అది ప్రసిద్ధ గయ పుణ్యక్షేత్రంగా మారింది.
<<-se>>#Ithihasaluquiz<<>>
Similar News
News January 4, 2026
విజయ్ ‘జన నాయకుడు’ రిలీజ్‌కు అడ్డంకులు!

తమిళ స్టార్ హీరో విజయ్ నటించిన ‘జన నాయకుడు’ మూవీ జనవరి 9న రిలీజ్ అవుతుందంటూ మేకర్స్ ప్రకటించినా ఇప్పటివరకూ సెన్సార్ సర్టిఫికెట్ రాలేదని తెలుస్తోంది. “సెన్సార్ బోర్డు కొన్ని రోజుల క్రితం U/A సర్టిఫికెట్‌ను సిఫార్సు చేసింది. కానీ ఇప్పటివరకు ఇవ్వలేదు” అని TVK డిప్యూటీ జనరల్ సెక్రటరీ CTR నిర్మల్ కుమార్ అన్నారు. సినిమాను ఆపడానికి ప్రయత్నాలు చేస్తున్నారని ఆరోపించారు. అడ్డంకులను అధిగమిస్తామని తెలిపారు.
News January 4, 2026
భర్తను చంపేందుకు భార్య సుపారీ.. తర్వాత ట్విస్ట్

TG: నిజామాబాద్(D) బోర్గాంలో దారుణం జరిగింది. దిలీప్ అనే వ్యక్తి మోజులో భర్త రమేశ్‌ను భార్య సౌమ్య చంపాలనుకుంది. అందుకు సుపారీ గ్యాంగ్‌కు రూ.35వేలు ఇచ్చింది. అయితే డబ్బులు తీసుకున్నాక ఆ గ్యాంగ్ సౌమ్య ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయలేదు. దీంతో ఆమె దిలీప్‌తో కలిసి ఇంట్లో నిద్రపోతున్న భర్త గొంతునులిమి హత్య చేసింది. విచారణలో అసలు విషయం బయటపడింది. సౌమ్య, దిలీప్, సుపారీ గ్యాంగ్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు.
News January 4, 2026
AIతో ఈ విషయాలు షేర్ చేయొద్దు

ప్రస్తుతం ChatGPT, Gemini, Grok వంటి AI చాట్‌బాట్‌ల వినియోగం వేగంగా పెరుగుతోంది. అయితే కొన్ని విషయాలను వీటితో పంచుకోవద్దని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా వ్యక్తిగత వివరాలు, బ్యాంక్ సమాచారం, పాస్‌వర్డ్‌లు, ఆఫీస్ సీక్రెట్‌లను షేర్ చేయకూడదు. అలాగే వైద్య, చట్టపరమైన సలహాల కోసం AIపై ఆధారపడటం ప్రమాదకరం. ఏఐ కరెక్ట్ సమాచారం చెప్పకపోవచ్చు కాబట్టి కీలక నిర్ణయాలకు దీనిని ఉపయోగించకూడదు.


