News December 25, 2025
ఇతిహాసాలు క్విజ్ -107

ఈరోజు ప్రశ్న: తన పరమ భక్తుడిని రక్షించడం కోసం ఓ దేవుడు ఒకే సమయంలో అటు మనిషిగా కాకుండా, ఇటు జంతువుగా కాకుండా సగం మానవ, సగం మృగం రూపాన్ని ధరించాడు. ఆ దేవుడెవరు? ఆయన ఎవరిని రక్షించారు?
☛ పై ప్రశ్నకు జవాబును సాయంత్రం ఆరు గంటలకు పబ్లిష్ చేస్తాం.
☛ మీకు సమాధానం తెలిస్తే కామెంట్ రూపంలో తెలియజేయండి.
<<-se>>#Ithihasaluquiz<<>>
Similar News
News December 25, 2025
నిత్య పెళ్లి కూతురు.. 9 మందిని పెళ్లి చేసుకుంది

AP: పెళ్లి అంటే కొత్త జీవితానికి నాంది. కానీ ఈ యువతికి మాత్రం సరదా. శ్రీకాకుళంలోని ఇచ్ఛాపురంలో నిత్య పెళ్లికూతురు వాణి ఉదంతం వెలుగులోకి వచ్చింది. అమాయక యువకులే టార్గెట్‌గా మేనత్త సహాయంతో 8 మందిని పెళ్లాడింది. వివాహం తర్వాత డబ్బులు, బంగారంతో పరారైంది. తాజాగా బరంపురం యువకుడిని మ్యారేజ్ చేసుకొని ఆరోజు రాత్రే పరారవ్వడంతో అతడు పోలీసులను ఆశ్రయించాడు. దీంతో ఆమె ఇప్పటికే పలువురిని మోసగించినట్లు బయటపడింది.
News December 25, 2025
అనూహ్య రద్దీ.. శ్రీవాణి టికెట్ల జారీపై TTD కీలక నిర్ణయం

తిరుమలలో అనూహ్యంగా రద్దీ పెరగడంతో టీటీడీ కీలక నిర్ణయం తీసుకుంది. డిసెంబర్ 27, 28, 29 తేదీల్లో శ్రీవాణి ఆఫ్‌లైన్ టికెట్ల జారీని నిలిపివేస్తున్నట్టు ప్రకటించింది. తిరుమలతోపాటు రేణిగుంట ఎయిర్‌పోర్ట్‌లో ఉన్న శ్రీవాణి టికెట్ బుకింగ్ ఆఫీసుల్లో టికెట్లు ఇవ్వరని టీటీడీ తెలిపింది. మరోవైపు శిలా తోరణం వరకు భక్తులు వేచిచూస్తున్నందున సర్వదర్శనానికి వచ్చేవారిని క్యూ లైన్లలోకి తాత్కాలికంగా అనుమతించడం లేదు.
News December 25, 2025
JAN 8న హాట్‌స్టార్‌లోకి ‘వెపన్స్’

సూపర్‌హిట్ హాలీవుడ్ హర్రర్ మూవీ ‘వెపన్స్’ మరో OTTలో స్ట్రీమింగ్‌కి రెడీ అవుతోంది. JAN 8 నుంచి ఫ్రీగా స్ట్రీమింగ్ కానున్నట్లు జియో హాట్‌స్టార్ ప్రకటించింది. AUGలో థియేటర్లలో విడుదలైన ఈ సినిమా కొన్ని వారాలకు అమెజాన్ ప్రైమ్, ఆపిల్ టీవీ ప్లస్, వుడు గూగుల్ వీడియోప్లేలో అద్దె విధానంలో అందుబాటులో ఉంది. రూ.335 కోట్లతో తీసిన హర్రర్ థ్రిల్లర్ రూ.2,400 కోట్లు కలెక్ట్ చేసి రికార్డులు క్రియేట్ చేసింది.


