News December 29, 2025
ఇతిహాసాలు క్విజ్ – 111

ఈరోజు ప్రశ్న: మహాభారతంలో పాండవుల కోసం మయసభను నిర్మించింది ఎవరు? రామాయణంలో ఆయన పాత్ర ఏంటి?
☛ పై ప్రశ్నకు జవాబును సాయంత్రం ఆరు గంటలకు పబ్లిష్ చేస్తాం.
☛ మీకు సమాధానం తెలిస్తే కామెంట్ రూపంలో తెలియజేయండి.
<<-se>>#Ithihasaluquiz<<>>
Similar News
News December 29, 2025
గద్వాల్: యూరియా కొరత లేదు- కలెక్టర్

జిల్లాకు అవసరమైన యూరియా ఎరువులు సరిపడా నిల్వలు ఉన్నాయని, రైతులకు కొరత లేకుండా సరఫరా చేస్తున్నట్లు కలెక్టర్ సంతోష్ తెలిపారు. రైతులకు యూరియా సరఫరాపై రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సోమవారం హైదరాబాద్ నుంచి అన్ని జిల్లాల కలెక్టర్లు, వ్యవసాయ శాఖ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. గద్వాల కలెక్టర్ మాట్లాడుతూ.. ప్రస్తుతం 8124 మెట్రిక్ టన్నుల యూరియా అందుబాటులో ఉందని పేర్కొన్నారు.
News December 29, 2025
2025: అత్యధిక వసూళ్ల చిత్రంగా ‘ధురంధర్’

ఈ ఏడాది అత్యధిక వసూళ్లు రాబట్టిన భారతీయ చిత్రంగా రణ్‌వీర్ సింగ్ నటించిన ‘ధురంధర్’ నిలిచింది. ఈ చిత్రం రూ.1034.8కోట్లు రాబట్టింది. IMDb ప్రకారం 2025లో బాక్సాఫీస్‌ను షేక్ చేసిన టాప్-10 మూవీస్ ఇవే.. ధురంధర్, కాంతార-2 (₹853.4Cr), ఛావా(₹808.7Cr), సైయారా(₹575.8Cr), కూలీ (₹516.7Cr), వార్-2 (₹360.7Cr), మహావతార్ నరసింహ (₹326.1Cr), లోక చాప్టర్-1 (₹302.1Cr), OG (₹298.1Cr), హౌజ్‌ఫుల్-5 (₹292.5కోట్లు)
News December 29, 2025
7 ఏళ్లకే చెస్ ఛాంపియన్.. ఈ చిన్నారి గురించి తెలుసా?

ఏడేళ్ల వయసులోనే ప్రపంచ చెస్ ఛాంపియన్‌గా నిలిచిన ప్రజ్ఞిక గురించి నెట్టింట తెగ చర్చ జరుగుతోంది. ఈ చిన్నారిని రాష్ట్రీయ బాల పురస్కార్ వరించింది. ఈ ఏడాది సెర్బియాలో జరిగిన “FIDE వరల్డ్ స్కూల్స్ చెస్ ఛాంపియన్‌షిప్-2025″లో U-7 బాలికల విభాగంలో స్వర్ణం సాధించింది. “నేను బెస్ట్ చెస్ ప్లేయర్ అవుతా” అని ఆమె మోదీతో చెెప్పిన మాటలు అందరినీ ఆకట్టుకుంటున్నాయి. ఏపీకి చెందిన వీరి ఫ్యామిలీ గుజరాత్‌లో స్థిరపడింది.


