News December 30, 2025
ఇతిహాసాలు క్విజ్ – 112 సమాధానం

ఈరోజు ప్రశ్న: జరాసంధుడికి ఆ పేరు ఎలా వచ్చింది?
సమాధానం: జరాసంధుడు బృహద్రథుడి కుమారుడు. బృహద్రథుడికి ఇద్దరు భార్యలు. వారిద్దరూ సగం శిశువుకు జన్మనిచ్చారు. వింతగా ఉన్న ఆ శరీర భాగాలను బయట పారేయగా, ‘జర’ అనే రాక్షసి వాటిని దగ్గరకు చేర్చి కలిపింది. ఆ రెండు సగ భాగాలు అతుక్కుని పరిపూర్ణ బాలుడిగా మార్చింది. ‘జర’ అనే రాక్షసి ఆ శరీర భాగాలను సంధించడం వల్ల అతనికి ‘జరాసంధుడు’ అనే పేరు వచ్చింది.
<<-se>>#Ithihasaluquiz<<>>
Similar News
News January 1, 2026
మహిళలూ కొత్త సంవత్సరంలో ఇవి ముఖ్యం

తల్లి, భార్య, కూతురు, కోడలు పాత్రల్లో జీవిస్తున్న మహిళ తన గురించి తాను మర్చిపోయింది. ఈ కొత్త సంవత్సరంలోనైనా నీ కోసం నువ్వు బ్రతుకు. నీ నిర్ణయాలు నువ్వు తీసుకో, శారీరక ఆరోగ్యంతో పాటు మానసిక ఆరోగ్యంపై దృష్టి పెట్టు. కష్టపడి నిర్మించుకున్న కెరీర్, చెమట చిందించి సంపాదించిన ప్రతి రూపాయినీ కాపాడుకో.. ఇంటర్నెట్ వాడకంలో జాగ్రత్తగా ఉండు.. ఆరోగ్యాన్ని సంరక్షించుకో.. కొత్తసంవత్సరాన్ని అద్భుతంగా మార్చుకో..
News January 1, 2026
క్లీనెస్ట్ సిటీ.. కలుషిత నీటితో 10 మంది మృతి

దేశంలోనే క్లీనెస్ట్ సిటీగా గుర్తింపు పొందిన ఇండోర్(MP)లో నీటి కాలుష్యంతో 10 మంది మరణించడం సంచలనంగా మారింది. మున్సిపల్ కార్పొరేషన్ సప్లై చేసే మంచినీటి పైప్ లైన్‌లో మురుగునీరు కలవడంతో ఇలా జరిగిందని అధికారులు వెల్లడించారు. DEC 25నే కుళాయిల నుంచి దుర్వాసన వస్తోందని చెప్పినా అధికారులు పట్టించుకోలేదని భగీరథ్‌పుర వాసులు తెలిపారు. మృతుల్లో 6 నెలల శిశువు కూడా ఉంది. 2వేల మంది చికిత్స పొందుతున్నారు.
News January 1, 2026
OP సిందూర్‌కు రాముడే ఆదర్శం: రాజ్‌నాథ్

ఆపరేషన్ సిందూర్‌కు శ్రీరాముడిని ఆదర్శంగా తీసుకున్నామని రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ చెప్పారు. ‘రాముడి లక్ష్యం కేవలం రావణుడిని చంపడమే కాదు.. అధర్మాన్ని అంతం చేయడం. మేం కూడా ఉగ్రవాదులకు, వాళ్లను పెంచి పోషిస్తున్న వారికి గుణపాఠం చెప్పడమే లక్ష్యంగా OP సిందూర్ చేపట్టాం’ అని తెలిపారు. ప్రపంచంలోనే అతిపెద్ద ఉద్యమాల్లో రామ జన్మభూమి ఉద్యమం ఒకటని, 5 దశాబ్దాలకు పైగా కొనసాగిందని పేర్కొన్నారు.


