News January 5, 2026

ఇతిహాసాలు క్విజ్ – 118

image

ఈరోజు ప్రశ్న: పాండవులు స్వర్గానికి వెళ్తుండగా ధర్మరాజును చివరి వరకు అనుసరించి, ఆయనతో పాటు స్వర్గ ద్వారం వరకు వెళ్లిన జంతువు ఏది? ఆ జంతువు రూపంలో ఉన్నది ఎవరు?
☛ పై ప్రశ్నకు జవాబును సాయంత్రం 6 గంటలకు పబ్లిష్ చేస్తాం.
☛ మీకు సమాధానం తెలిస్తే కామెంట్ రూపంలో తెలియజేయండి. <<-se>>#Ithihasaluquiz<<>>

Similar News

News January 20, 2026

సూచీలు కుప్పకూలడానికి కారణాలు ఇవే

image

దేశీయ స్టాక్ మార్కెట్లు <<18907026>>భారీ నష్టాలు<<>> చూసిన విషయం తెలిసిందే. EU దేశాలతో అమెరికా ట్రేడ్ వార్‌కు దిగడం అంతర్జాతీయంగా అనిశ్చితికి కారణమైంది. అదే సమయంలో నిన్న విదేశీ మదుపర్లు రూ.3,262 కోట్ల విలువైన షేర్లను అమ్మేయడం మార్కెట్ సెంటిమెంట్‌ను దెబ్బతీసింది. డాలర్‌తో పోలిస్తే రూపాయి మరింత పతనం కావడం, క్రూడాయిల్ ధరలు పెరగడం, కంపెనీల మూడో త్రైమాసిక ఫలితాలు ఆశించిన స్థాయిలో లేకపోవడం అమ్మకాల ఒత్తిడిని పెంచింది.

News January 20, 2026

నితిన్ నబీన్‌కు ₹3.06 కోట్ల ఆస్తి, ₹56 లక్షల అప్పు

image

భారతీయ జనతా పార్టీ జాతీయాధ్యక్షుడిగా ఎన్నికైన నితిన్ నబీన్ ఆస్తులు, అప్పుల వివరాలు వెలుగులోకి వచ్చాయి. గత ఏడాది బిహార్ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా దాఖలు చేసిన అఫిడవిట్ ప్రకారం ఆయన ఆస్తులు ₹3.06 CR, అప్పులు ₹56L పైగా ఉన్నాయి. తనూ, తన భార్య దీప్ మాలా పేరున బ్యాంకుల్లో ₹60వేల నగదు, ₹98 లక్షల మేర డిపాజిట్లు ఉన్నాయి. నబీన్ ఇంటర్మీడియట్ పూర్తిచేశారు. భార్య నవీరా ఎంటర్ ప్రైజెస్ డైరెక్టర్‌గా ఉన్నారు.

News January 20, 2026

హ్యాపీగా ఉండాలంటే ఈ ఆహారం తినండి

image

మనల్ని ఆనందంగా ఉంచే హార్మోన్ అయిన డోపమైన్ ఆహారంలోనూ దొరుకుతుందట. ఆ ఫుడ్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం.. బెర్రీస్, అరటిపండ్లు, నట్స్, ఫ్యాటీ ఫిష్, ప్రోబయాటిక్స్, ఓట్స్, ఆకుకూరలు, గుడ్లు, అవకాడో వంటివి ఆహారంలో చేర్చుకోవడంవల్ల ఆరోగ్యం, జ్ఞాపకశక్తి మెరుగవుతుంది. వీటి వల్ల మూడ్ బాగుండటమే కాకుండా మెంటల్ క్లారిటీ, డిప్రెషన్ లక్షణాలు తగ్గించి ఎమోషనల్‌ హెల్త్ బావుండేలా చూస్తాయంటున్నారు నిపుణులు.