News January 9, 2026
ఇతిహాసాలు క్విజ్ – 122 సమాధానం

ఈరోజు ప్రశ్న: రావణుడి కన్నా ముందు శ్రీరాముడు ఇంకా ఎవరెవరితో యుద్ధం చేశాడు?
సమాధానం: విశ్వామిత్రుని యజ్ఞరక్షణ కోసం తాటకను, ఆపై సుబాహుడిని వధించాడు. అరణ్యవాసంలో విరాధుడిని అంతం చేశాడు. శూర్పణఖ కారణంగా జరిగిన యుద్ధంలో వేల మందికి పైగా రాక్షసులను ఎదుర్కొన్నాడు. ఈ క్రమంలో దూషణుడు, త్రిశిరస్కుడు, మహాబలవంతుడైన ఖరుడిని తన విష్ణు ధనుస్సుతో సంహరించి మునులకు అభయమిచ్చాడు.
<<-se>>#Ithihasaluquiz<<>>
Similar News
News February 19, 2026
చైనా అద్భుతం.. స్టెమ్ సెల్ థెరపీతో డయాబెటిస్ నయం

చైనా సైంటిస్టులు అద్భుతం చేశారు. స్టెమ్ సెల్ థెరపీతో ప్రపంచంలోనే తొలిసారిగా టైప్-2 డయాబెటిస్ వ్యాధిని నయం చేశారు. ఆరోగ్యకరమైన ప్యాంక్రియాటిక్ కణాలను మార్పిడి చేసి శరీరం ఇన్సులిన్‌ను సరిగ్గా ఉపయోగించుకునేలా చేశారు. ఈ చికిత్స విజయవంతమైంది. ఇది పూర్తిస్థాయిలో అందుబాటులోకి వస్తే రోగి ఇన్సులిన్ ఇంజెక్షన్లపై ఆధారపడాల్సిన అవసరం లేదు. ప్రపంచవ్యాప్తంగా డయాబెటిస్ కేసులు పెరుగుతున్న విషయం తెలిసిందే.
News February 19, 2026
డయాబెటిస్ రోగుల్లో స్టెమ్ సెల్ థెరపీ ఎలా పనిచేస్తుంది?

తొలుత డయాబెటిస్ రోగి లేదా దాత నుంచి స్టెమ్ సెల్స్‌ను తీసుకుంటారు. ల్యాబ్‌లో ప్రత్యేక రసాయనాలు, జెనెటిక్ విధానాల ద్వారా ప్యాంక్రియాటిక్(ఇవి జీర్ణక్రియకు అవసరమైన ఎంజైమ్‌లను, చక్కెర స్థాయులను నియంత్రించే హార్మోన్లను ఉత్పత్తి చేస్తాయి) కణాలను రూపొందిస్తారు. ఇవి ఇన్సులిన్‌ను ఉత్పత్తి చేసే స్థాయికి చేరగానే రోగి శరీరంలోకి మార్పిడి చేస్తారు. బాడీ వాటిని స్వీకరించే దానిని బట్టి సక్సెస్ రేటు ఉంటుంది.
News February 19, 2026
జింబాబ్వే.. ఓటమి లేకుండా సూపర్-8కు..

T20WC-2026: జింబాబ్వే జట్టు ఈసారి ఒక్క ఓటమి లేకుండా సూపర్-8లోకి అడుగుపెట్టింది. గ్రూప్-Bలో ఒమన్, ఆస్ట్రేలియా, శ్రీలంకలపై విజయం సాధించింది. ఐర్లాండ్‌తో మ్యాచ్ వర్షం వల్ల రద్దైంది. 1.506 NRRతో ఆ గ్రూప్‌లో టాప్-1గా నిలిచింది. ఇక సూపర్-8లో జింబాబ్వే.. భారత్, సౌతాఫ్రికా, వెస్టిండీస్‌లతో తలపడనుంది. మరి సూపర్-8లో ఈ జట్టు ఎలాంటి సంచలనం సృష్టిస్తుందో చూడాలి.


