News October 4, 2025

ఇతిహాసాలు క్విజ్ – 25

image

1. పంచవటి ఏ నదీ తీరాన ఉంది?
2. అజ్ఞాతవాసంలో అర్జునుడు ఏ నపుంసక వేషంలో విరాట రాజభవనంలో ఉన్నాడు?
3. అష్టాదశ పురాణాలను ఎవరు రచించారు?
4. హనుమంతుడు హిమాలయాల్లోని ఏ పర్వతం నుంచి సంజీవని తీసుకొచ్చారు?
5. వ్యాసుడు రచించిన భాగవతంలో ఎన్ని స్కంధాలు ఉన్నాయి?
<<-se>>#ithihasaluquiz<<>>

Similar News

News October 4, 2025

24 గేట్లు ఎత్తి సాగర్ నీటి విడుదల

image

కృష్ణా నదీ పరీవాహక ప్రాంతంలో కురుస్తున్న వర్షాలతో నాగార్జున సాగర్లోకి భారీగా నీరు చేరుతోంది. దీంతో సాగర్‌ 24 ఎత్తి కిందికి నీటిని వదులుతున్నారు. 590 ఫీట్ల సామర్థ్యం కలిగిన జలాశయంలో నీటి మట్టం 587కు చేరుకుంది. కాలువలకూ భారీగా నీటిని వదులుతున్నందున నల్గొండ, సూర్యాపేట, ఖమ్మం జిల్లాల్లోని ప్రజలను ఇరిగేషన్ శాఖ అప్రమత్తం చేసింది. నీటి ఉధృతి వల్ల కాలువల్లో ఈత కొట్టవద్దని సూచించింది.

News October 4, 2025

ఆటో డ్రైవర్ల కోసం కొత్త యాప్: చంద్రబాబు

image

AP: ఉబర్, ర్యాపిడోల పోటీని తట్టుకునేలా ఆటో డ్రైవర్లకు అండగా ఉండేందుకు కొత్త యాప్ తీసుకొస్తామని సీఎం చంద్రబాబు తెలిపారు. దీంతో ఎక్కడ ఉన్నా నేరుగా బుకింగ్స్ డ్రైవర్లకు వెళ్తాయని చెప్పారు. 24 గంటలు ఆటో స్టాండ్‌లో ఉండే పనిలేకుండా చేస్తామన్నారు. అవసరమైతే ఆటో డ్రైవర్ సంక్షేమ బోర్డు తీసుకొస్తామన్నారు. కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసి, యాప్ నిర్వహణ డ్రైవర్లు చేసేలా చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు.

News October 4, 2025

పీరియడ్స్ పెయిన్‌ రిలీఫ్ కోసం డివైజ్

image

నెలసరిలో చాలామంది మహిళలకు పొత్తికడుపు, నడుము నొప్పి ఎక్కువగా వస్తుంది. వీరికోసం వచ్చిందే ఈ పీరియడ్స్ పెయిన్ రిలీఫ్ డివైజ్‌. దీన్ని నడుము దగ్గర ధరించాలి. దీనికి రెండు ప్యాచ్‌లు ఉంటాయి. పొత్తికడుపు దగ్గర రెండు ప్యాచ్‌లు స్టిక్ చేసి, డివైజ్‌కు ఉన్న పవర్ బటన్‌ను నొక్కాలి. మీకు బాగా నొప్పిగా ఉంటే దాన్ని బట్టి హీట్ సర్దుబాటు చేసుకునే ఆప్షన్స్ ఉంటాయి. ఇది నొప్పి నుంచి ఉపశమనం కలిగిస్తుంది.