News November 8, 2025
ఇతిహాసాలు క్విజ్ – 60

1. కృష్ణుడి మొదటి గురువు ఎవరు?
2. కృష్ణుడు పెరిగిన వనాన్ని ఏమంటారు?
3. నాగులకు తల్లి ఎవరు?
4. కుంభకర్ణుడి నిద్రకు కారణమైన దేవుడు ఎవరు?
5. స్కందుడు అంటే ఎవరు?
☞ సరైన సమాధానాలను సాయంత్రం ఆరు గంటలకు పబ్లిష్ చేస్తాం.
<<-se>>#Ithihasaluquiz<<>>
Similar News
News March 23, 2026
అదనపు కట్నం వేధింపులు.. వివాహిత ఆత్మహత్య

అదనపు కట్నం వేధింపులు తాళలేక నాగలక్ష్మి(23) అనే మహిళ సోమవారం అత్తిలి మండలం స్కిన్నెరపురంలో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. కాళ్ల మండలం జక్కరంకు చెందిన నాగలక్ష్మికి 2018లో కళ్యాణి దుర్గారావుతో వివాహమైంది. వీరికి ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. భర్త అదనపు కట్నం కోసం వేధిస్తుండటంతోనే తన కుమార్తె ప్రాణాలు తీసుకుందని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
News March 23, 2026
INTERESTING: గుండె, మెదడు లేని జీవి!

సముద్ర గర్భంలో ప్రకృతి సృష్టించిన అద్భుతాలలో ‘స్టార్ ఫిష్’ ఒకటి. దీనికి మిగిలిన జీవులలా మెదడు, గుండె, రక్తం ఉండవు. రక్తానికి బదులుగా ఇది సముద్రపు నీటినే తన శరీరమంతా పంపిస్తూ పోషకాలను పొందుతుంది. దీనిని ‘వాటర్ వాస్క్యులర్ సిస్టమ్’ అంటారు. మెదడు లేకపోయినా, తన నాడీ వ్యవస్థ ద్వారా పరిసరాలను పసిగట్టి ఆహారాన్ని వేటాడటం ఈ జీవి ప్రత్యేకత. ఇలాంటి ఇంట్రెస్టింగ్ విషయాలు ‘వంద రోజుల్లో-వంద వింతలు’లో(28/100)
News March 23, 2026
రేపు పిడుగులతో కూడిన వర్షాలు

రేపు రాష్ట్రంలో పిడుగులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉందని APSDMA తెలిపింది. మన్యం, అల్లూరి, పోలవరం, విశాఖ, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, తూ.గో, ప.గో, ఏలూరు, కృష్ణా, NTR, గుంటూరు, శ్రీసత్యసాయి, కడప, అన్నమయ్య జిల్లాల్లో మోస్తరు వానలు పడే ఛాన్స్ ఉందని పేర్కొంది. వ్యవసాయ పనుల్లో రైతులు జాగ్రత్తలు తీసుకోవాలని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. చెట్ల కింద, పొలాల్లో, బహిరంగ ప్రదేశాల్లో ఉండొద్దంది.


