News November 19, 2025
ఇతిహాసాలు క్విజ్ – 71

ఈరోజు ప్రశ్న: గణేశుడు మహాభారతాన్ని రాసేటప్పుడు తన దంతాన్ని ఎందుకు విరిచాడు?
☛ పై ప్రశ్నకు సమాధానాన్ని సాయంత్రం ఆరు గంటలకు పబ్లిష్ చేస్తాం.
☛ మీకు జవాబు తెలిస్తే కామెంట్ రూపంలో తెలియజేయండి.
<<-se>>#Ithihasaluquiz<<>>
Similar News
News March 27, 2026
ఈ రామాలయాలు ప్రత్యేకం

రామాలయాల్లో లక్ష్మణుడు ఉండటం సహజం. కానీ కొన్ని క్షేత్రాల్లో రాముడు-సీత మాత్రమే కనిపిస్తారు. నిజామాబాద్ జిల్లా ఇందల్వాయిలోని ఏకశిలా విగ్రహంపై సీతను ఒడిలో కూర్చోబెట్టుకున్న రాముడి రూపం కనిపిస్తుంది. దేశంలో ఇలా ఉన్న ఆలయం ఇదొకటేనని పండితులు చెబుతున్నారు. ఇక ఒంటిమిట్ట రామాలయంలో ఆంజనేయుడు ఉండడు. వనవాసంలో ఈ ప్రాంతాన్ని సీతారాములు సందర్శించారని, అప్పటికి హనుమంతుడు పరిచయం కాకపోవడంతో ఆయన విగ్రహం ఉండదట.
News March 27, 2026
లిల్లీ పంటలో దుంపకుళ్లు తెగులు – నివారణ

లిల్లీ పంటలో దుంపకుళ్లు తెగులు అధిక తేమ మరియు శిలీంధ్రాల వల్ల వస్తుంది. ఇది పంట దిగుబడిని భారీగా దెబ్బతీస్తుంది. ఈ తెగులు సోకిన మొక్క ఆకులు పసుపు రంగులోకి మారతాయి. తెగులు తీవ్రమైతే మొక్క మొత్తం వడిలిపోయి, ఎండిపోతుంది. భూమిలో ఉన్న దుంపలు మెత్తబడి, కుళ్లిపోయి దుర్వాసన వస్తుంది. ఈ తెగులు నివారణకు లీటరు నీటికి హెక్సాకొనజోల్ 2ml లేదా ప్రొపికొనజోల్ 1ml కలిపి పిచికారీ చేయాలని నిపుణులు సూచిస్తున్నారు.
News March 27, 2026
పారాక్వాట్‌ను బ్యాన్ చేయండి.. PM, CMకు నటుడి విజ్ఞప్తి

TG: కలుపు నివారణకు వాడే పారాక్వాట్(గడ్డి మందు)ను బ్యాన్ చేయాలని నటుడు రాహుల్ రామకృష్ణ ప్రధాని మోదీ, సీఎం రేవంత్‌కు విజ్ఞప్తి చేశారు. దాన్ని తాగి తన సోదరుడు ఆత్మహత్య చేసుకున్నాడని ఆవేదన వ్యక్తం చేశారు. ఆ మందు సులభంగా దొరకడం వల్ల దుర్వినియోగం జరుగుతోందన్నారు. కాగా ఈ మందు విక్రయాలపై ప్రభుత్వం ఇప్పటికే <<19342790>>నియంత్రణ చర్యలు<<>> చేపట్టింది.


