News December 11, 2025

ఇతిహాసాలు క్విజ్ – 93

image

ఈరోజు ప్రశ్న: ‘ఏమంటివి? ఏమంటివి ? జాతి నెపమున సూత సుతునకిందు నిలువ అర్హత లేదందువా! ఎంత మాట? ఎంత మాట? ఇది క్షాత్ర పరీక్షయే కాని క్షత్రియ పరీక్ష కాదే? కాదు, కాకూడదు, ఇది కులపరీక్షయే అందువా ! నీ తండ్రి భరద్వాజుని జననమెట్టిది?’ ఈ మాటలు ఎవరు ఎవరితో అంటారు?
☛ పై ప్రశ్నకు జవాబును సాయంత్రం ఆరు గంటలకు పబ్లిష్ చేస్తాం. ☛ మీకు సమాధానం తెలిస్తే కామెంట్ రూపంలో తెలియజేయండి. <<-se>>#Ithihasaluquiz<<>>

Similar News

News March 4, 2026

TPCC జాబితా: ఛాన్సు దక్కేదెవరికో!

image

TG: రాజ్యసభ సీటు కోసం INCలో పోటీ రసవత్తరంగా మారింది. రాష్ట్రం నుంచి సామాజిక వర్గాల వారీగా 16 పేర్లతో జాబితాను AICCకి పంపామని TPCC చీఫ్ మహేశ్ కుమార్ తెలిపారు. వారిని ఢిల్లీకి పిలిచి మాట్లాడో లేదా ఫోన్లోనే చర్చించో తుది నిర్ణయం తీసుకోవచ్చన్నారు. కాగా VH, వేం నరేందర్ రెడ్డి, జీవన్ రెడ్డి వంటి నేతలతో పాటు కొందరు ప్రముఖులనూ జాబితాలో చేర్చినట్లు తెలుస్తోంది. వీరిలో ఎవరికి ఛాన్సు దక్కుతుందో చూడాల్సిందే.

News March 3, 2026

‘హార్ముజ్’ సంక్షోభం.. ఇండియాకు అండగా రష్యా!

image

హార్ముజ్ జలసంధిని ఇరాన్ <<19285220>>మూసివేసిన<<>> నేపథ్యంలో ఇండియాకు సాయం చేసేందుకు రష్యా ముందుకొచ్చింది. చమురు సరఫరాలో అంతరాయాలు ఏర్పడితే తాము క్రూడ్ పంపుతామని రష్యన్ వర్గాలు చెప్పినట్లు రాయిటర్స్ తెలిపింది. మరోవైపు ఆయిల్ కొరత ఏర్పడితే రష్యా నుంచి ఇండియా దిగుమతులు పెంచవచ్చని తెలుస్తోంది. ప్రస్తుతం ఇండియా క్రూడాయిల్, పెట్రోలియం <<19289613>>నిల్వలు<<>> 40-45 రోజులు వస్తాయని సమాచారం.

News March 3, 2026

అప్పుడు నా కెరీర్ ముగిసిందనుకున్నా: స్నేహ

image

తన కెరీర్ పీక్ స్టేజ్‌లో ఉన్నప్పుడు ఒక యాక్సిడెంట్ జీవితాన్ని తలకిందులు చేసిందని నటి స్నేహ వెల్లడించారు. ‘వరుస సినిమాలతో(2002) బిజీగా ఉన్నప్పుడు యాక్సిడెంట్ జరిగింది. తీవ్ర గాయాలవడంతో 8 నెలలు మంచానికి పరిమితమయ్యా. నా కెరీర్ ముగిసిందనుకున్నా. కానీ డైరెక్టర్ కరు పళనియప్పన్ “పార్థిబన్ కనవు”(2003) మూవీలో అవకాశం ఇవ్వడంతో మళ్లీ కెమెరా ముందుకు రాగలిగా’ అని ఇటీవల ఓ ప్రోగ్రామ్‌లో గుర్తుచేసుకున్నారు.