News November 27, 2024

ఇథనాల్‌ పరిశ్రమ నిర్మాణం ఆగిపోయేవరకు పోరాడుతా: ఏలేటి

image

ఇథనాల్‌ పరిశ్రమ తరలింపుపై పలుమార్లు ఉన్నతాధికారులతో మాట్లాడినట్లు నిర్మల్‌ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వరరెడ్డి బుధవారం ఓ ప్రకటనలో తెలిపారు. ఈ సమస్యపై గుండంపల్లి రైతులందరితో చర్చించి న్యాయపోరాటం చేయనున్నట్లు పేర్కొన్నారు. దిలావర్‌పూర్‌ ప్రజలకు అండగా నిలబడతానని, ఫ్యాక్టరీ నిర్మాణం ఆగిపోయేలా చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చారు. పోలీస్‌ అధికారులు రైతులపై ఎలాంటి కేసులు పెట్టవద్దని కోరారు.

Similar News

News September 15, 2025

40 ఫిర్యాదులను స్వీకరించిన ఆదిలాబాద్ ఎస్పీ

image

ఆదిలాబాద్ జిల్లా పోలీసులు ప్రజల రక్షణ భద్రతకు ఎల్లవేళలా ముందుంటారని ఎస్పీ అఖిల్ మహాజన్ తెలిపారు. సోమవారం డీపీఓ ఆఫీస్‌లో నిర్వహించిన గ్రీవెన్స్ కార్యక్రమంలో భాగంగా ప్రజల నుంచి ఫిర్యాదులను ఎస్పీ స్వీకరించారు. ప్రజల సమస్యల పట్ల బాధ్యతాయుతంగా స్పందించి వెంటనే ఎస్పీ సంబంధిత పోలీసు అధికారులకు ఫోన్ ద్వారా ఆదేశాలించారు. సమస్యను పరిష్కరించే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. 40 ఫిర్యాదులు వచ్చినట్లు చెప్పారు.

News September 15, 2025

ఆదిలాబాద్: ఇవాళ, రేపు DEGREEలో SPOT అడ్మిషన్లు

image

ఈనెల 15,16వ తేదీల్లో మిగిలిపోయిన సీట్లకు స్పాట్ అడ్మిషన్లు నిర్వహిస్తున్నట్లు ఆదిలాబాద్ ప్రభుత్వ ఆర్ట్స్ అండ్ కామర్స్ డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ అతిక్ బేగం పేర్కొన్నారు. బీఏ ఇంగ్లిష్ మీడియం, తెలుగు/ఉర్దూ మీడియంలో సీట్లు కాళీగా ఉన్నాయన్నారు. అలాగే బీకాం తెలుగు/ఇంగ్లిష్ మీడియంలో సీట్లు ఉన్నట్లు తెలియజేశారు. ప్రవేశం పొందగల విద్యార్థులు ఒక సెట్ జిరాక్స్ ధ్రువపత్రాలతో హాజరు కావాలన్నారు.

News September 14, 2025

ADB: లోక్ అదాలత్‌లో న్యాయం: జిల్లా జడ్జి

image

లోక్ అదాలత్ ప్రాముఖ్యతను వివరిస్తూ జిల్లా ప్రధాన న్యాయమూర్తి కె.ప్రభాకర్ రావు, రాజీమార్గమే రాజమార్గం అని తెలిపారు. బోథ్ జూనియర్ కోర్టులో జరిగిన ఈ కార్యక్రమంలో జూనియర్ సివిల్ జడ్జి కె.సందీప్, రాజీ ద్వారా 34 క్రిమినల్ కేసులు, ఒక సివిల్ వివాదం, నేరం ఒప్పుకోవడం ద్వారా 22 ఎక్సైజ్ కేసులు, 429 ఎస్టీసి కేసులను పరిష్కరించారు.