News August 27, 2024
ఇది అధికారిక నిర్ణయమా లేక అనధికార నిర్లక్ష్యమా?: కేటీఆర్

కాకతీయ కళాతోరణం చార్మినార్ లేని రాజముద్రతో గ్రేటర్ వరంగల్ కార్పొరేషన్ ప్రధాన కార్యాలయం ఎదుట అధికారులు ఏర్పాటు చేసిన ఫ్లెక్సీపై సిరిసిల్ల MLA కేటీఆర్ ట్విట్టర్ ద్వారా ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ కొత్త చిహ్నం ఎవరు, ఎప్పుడు ఆమోదించారు? ఒకవేళ ఆమోదించకపోతే అధికారులు ఎందుకు దీన్ని వాడారు? దీనికి కారకులెవరో తెలుసుకొని వారిపై చర్య తీసుకోవాలని డిమాండ్ చేశారు.
Similar News
News February 18, 2026
కరీంనగర్: ‘విష’ ప్రయోగం.. 50 కోళ్లు మృత్యువాత!

కరీంనగర్ జిల్లా ఊటూర్‌లో మానవత్వం మంటగలిసింది. గుర్తుతెలియని వ్యక్తులు కోళ్ల దాణాలో విషం కలపడంతో 50 నాటుకోళ్లు ప్రాణాలు కోల్పోయాయి. స్వయం ఉపాధి కోసం వీటిని పెంచుతున్న నిరుద్యోగి జలంధర్ రెడ్డికి సుమారు ₹70వేల నష్టం వాటిల్లింది. పశువైద్యులు విషప్రయోగాన్ని ధృవీకరించగా, బాధితుడు పోలీసులను ఆశ్రయించారు. నోరులేని జీవాలను పొట్టనబెట్టుకున్న నిందితులను కఠినంగా శిక్షించాలని గ్రామస్థులు డిమాండ్ చేస్తున్నారు.
News February 18, 2026
కరీంనగర్: సర్వేయర్లకు లైసెన్సులు అందజేసిన కలెక్టర్

భూభారతి చట్టం-2025లో భాగంగా శిక్షణ పొందిన సర్వేయర్లకు కలెక్టర్ పమేలా సత్పతి మంగళవారం లైసెన్సులు జారీ చేశారు. కరీంనగర్ జిల్లా నుంచి ఎంపికైన 274 మందిలో ఇప్పటికే 136 మందికి సీఎం చేతుల మీదుగా పత్రాలు అందగా, మిగిలిన వారిలో 41 మందికి నేడు కలెక్టర్ లైసెన్సులు అందించారు. రాష్ట్రవ్యాప్తంగా 5000 మందికి శిక్షణ ఇచ్చి ప్రభుత్వం ఈ నియామక పత్రాలను అందజేస్తోంది.