News January 21, 2026
ఇది డిఫరెంట్ ఎక్స్‌పీరియన్స్ అవుతుంది: రోహిత్

టీ20 WCని ఈసారి ఇంట్లో కూర్చొని చూడటం తనకు స్ట్రేంజ్ ఎక్స్‌పీరియన్స్ అవుతుందని రోహిత్ శర్మ అన్నారు. 2007 నుంచి 2024 వరకు అన్ని టీ20WCలలో తాను ఆడానని, ఈసారి స్టేడియంలో ఎక్కడో కూర్చొని లేదా ఇంటి నుంచి చూడటం డిఫరెంట్‌గా ఉంటుందన్నారు. గతంలో WCకి ముందు కొన్ని కఠిన నిర్ణయాలు తీసుకున్నట్లు గుర్తుచేసుకున్నారు. స్క్వాడ్‌లో ఉన్న 15 మందిని ఎలా ఉపయోగించాలో తెలుసుకోవడం ముఖ్యమని పేర్కొన్నారు.
Similar News
News February 13, 2026
కీలకం కానున్న MLA, MLC, MPల ఓట్లు

TG: మున్సి‘పోల్స్’ ఫలితాల్లో కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ మధ్య పోటాపోటీగా ఉన్న చోట్ల ఛైర్మన్, మేయర్ ఎంపికలో ఎక్స్‌అఫీషియో సభ్యులుగా MLA, MLC, MPల ఓట్లు కీలకం కానున్నాయి. రాజ్యసభ సభ్యులు, MLCలు రాష్ట్రంలో ఎక్కడైనా తమ ఓటు వినియోగించుకొనేందుకు ఆప్షన్ ఇచ్చుకోవచ్చు. అదే లోక్‌సభ సభ్యులు, MLAలు తమ నియోజకవర్గ పరిధిలోని ఏదో ఒక మున్సిపాల్టీలో మాత్రమే ఓటేయాల్సి ఉంటుందని అధికారులు పేర్కొన్నారు.
News February 13, 2026
నీళ్లపై చర్చలకు మేము సిద్ధం: చంద్రబాబు

AP: నీటి సమస్యపై 2 తెలుగు రాష్ట్రాలు ఇచ్చిపుచ్చుకునేలా ఉండాలని CM CBN స్పష్టం చేశారు. పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్ట్‌ను AP అడ్డుకుంటోందన్న TG CM రేవంత్ వ్యాఖ్యలపై అసెంబ్లీలో చంద్రబాబు స్పందించారు. ‘APలోని నల్లమల సాగర్‌ను TG అడ్డుకోవడం సరికాదు. కాళేశ్వరం ప్రాజెక్టుకు మేం సపోర్ట్ చేశాం. 5000 TMCల గోదావరి నీరు వృథాగా పోతోంది. కృష్ణాలోనూ నీటి వృథా ఉంది. సమస్యలపై చర్చకు మేము సిద్ధం’ అని పేర్కొన్నారు.
News February 13, 2026
ఆటిజంకు చికిత్స ఇదే..

ప్రపంచంలోని ప్రతి 68 మంది చిన్నారుల్లో ఒకరు ఆటిజంతో బాధపడుతున్నారు. వయసుకు తగ్గట్టు మానసిక ఎదుగుదల లేకపోతే దాన్ని ఆటిజం అంటారు. దీనికి చికిత్స లేదు కానీ చిన్న వయసునుంచే కొన్ని పద్ధతులు పాటించడం వల్ల మార్పు ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. లక్షణాలను బట్టి ఆక్యుపేషనల్ థెరపీ, స్పీచ్ థెరపీ, బిహేవియర్ థెరపీ ఉంటాయి. వీటితో పాటు తల్లిదండ్రులే శిక్షకులుగా మారాలని నిపుణులు సూచిస్తున్నారు.


