News December 15, 2025
ఇది తమిళనాడు.. తలవంచబోం: స్టాలిన్

తమ తర్వాతి టార్గెట్ తమిళనాడేనని కేంద్ర మంత్రి అమిత్ షా చేసిన వ్యాఖ్యలకు CM స్టాలిన్ కౌంటర్ ఇచ్చారు. ఇక్కడ BJP ఎప్పటికీ గెలవలేదన్నారు. ‘ఇది తమిళనాడు. మా క్యారెక్టర్‌ను మీరు అర్థం చేసుకోలేరు. ప్రేమతో వస్తే ఆలింగనం చేసుకుంటాం. అహంకారంతో వస్తే తలవంచం. మిమ్మల్ని నేరుగా ఎదుర్కొని ఓడిస్తాం’ అని స్పష్టం చేశారు. BJP గెలవలేని ఏకైక రాష్ట్రం తమిళనాడు అని, అందుకే అమిత్ షా చిరాకు పడుతున్నారని ఎద్దేవా చేశారు.
Similar News
News December 16, 2025
ఆరోగ్య భద్రతకు డిజిటల్ హెల్త్ రికార్డులు: CBN

AP: ప్రజల ఆరోగ్య భద్రతకు సంజీవని ప్రాజెక్టు కింద డిజిటల్ హెల్త్ రికార్డులు రూపొందిస్తున్నట్లు CM CBN తెలిపారు. రియల్ టైమ్‌లోనే ఆరోగ్య వివరాలు తెలుసుకునేలా సంజీవని ద్వారా ఇంటిగ్రేట్ చేస్తున్నామన్నారు. ‘రోగాలను ముందుగా నిరోధించే ప్రివెంటివ్ టెక్నాలజీస్‌పై దృష్టి పెట్టాలి. యోగా, నేచురోపతిని ప్రోత్సహించాలి. డిజిటల్ ఏఐ ఎనేబుల్డ్ హెల్త్, హెల్త్ ఫైనాన్సింగ్ రిఫార్మ్స్‌పై దృష్టి పెట్టాలి’ అని సూచించారు.
News December 16, 2025
34ఏళ్లకే బిలియనీర్ అయిన మీషో CEO

ప్రముఖ E-కామర్స్ ప్లాట్‌ఫాం Meesho కో-ఫౌండర్, CEO విదిత్ ఆత్రే 34ఏళ్లకే బిలియనీర్‌గా మారారు. ఇటీవల స్టాక్ మార్కెట్లో లిస్ట్ అయిన మీషో షేర్లు ఇష్యూ ధర రూ.111 నుంచి రూ.193కు ఎగబాకడంతో ఆయన నెట్‌వర్త్ 1B డాలర్లను దాటింది. కంపెనీలో 11.1 శాతం వాటా కలిగిన ఆత్రే షేర్ల విలువ ప్రస్తుతం సుమారు రూ.9,128 కోట్లుగా ఉంది. మరో కో-ఫౌండర్ సంజీవ్ బర్న్‌వాల్ సంపద కూడా భారీగా పెరిగి రూ.6,099 కోట్లకు చేరుకుంది.
News December 16, 2025
డైరెక్టర్ సుజీత్‌కు కాస్ట్లీ గిఫ్ట్ ఇచ్చిన పవర్‌స్టార్

‘OG’ సినిమాతో భారీ విజయాన్ని అందించిన డైరెక్టర్ సుజీత్‌కు పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ అదిరిపోయే కానుక ఇచ్చారు. దాదాపు రూ. 2 కోట్ల విలువైన ల్యాండ్ రోవర్ డిఫెండర్ కారును బహుమతిగా అందించారు. దీనిపై సుజీత్ స్పందిస్తూ.. ‘చిన్నప్పటి నుంచి అభిమానిగా ఉన్న నాకు నా ‘OG’ నుంచి లభించిన ఈ ప్రేమ, ప్రోత్సాహం వెలకట్టలేనిది. ఎప్పటికీ ఆయనకు రుణపడి ఉంటా’ అని Xలో ఎమోషనల్ అయ్యారు. దీనికి సంబంధించిన ఫొటోలు పంచుకున్నారు.


