News September 5, 2024
ఇది పెద్దిరెడ్డి కుట్ర: ఆదిమూలం స్వగ్రామ మహిళలు

సత్యవేడు ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలంపై లైంగిక ఆరోపణలు రాగా.. ఆయన స్వగ్రామం నారాయణవనం మండలం భీమునిచెరువు మహిళలు ఎమ్మెల్యేకు మద్దతుగా నిలిచారు. ‘ఆదిమూలం సుమారు 45 ఏళ్లుగా రాజకీయంలో ఉన్నారు. ఆయనపై చిన్న మచ్చ కూడా లేదు. ఆదిమూలంపై ఇలాంటి తీవ్రమైన ఆరోపణలు చేయడంలో మాజీ మంత్రి పెద్దిరెడ్డి కుట్ర ఉంది’ అంటూ గ్రామంలో ఎమ్మెల్యేపై ఆరోపణలు చేసిన మహిళ దిష్టిబొమ్మ దగ్ధం చేశారు.
Similar News
News March 2, 2026
చిత్తూరు: కరెంట్ సమస్య ఉంటే కాల్ చేయండి!

చిత్తూరు జిల్లాలో చాలా మంది లోవోల్టేజ్, ఎక్కువ కరెంట్ ఛార్జీలు, మీటర్ల నూతన కనెక్షన్లు ఇతర సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు. వాటి పరిష్కారానికి ‘డయల్ యువర్ ఎస్ఈ’ కార్యక్రమం నేడు నిర్వహిస్తున్నామని ఎస్ఈ ఇస్మాయిల్ ఓ ప్రకటనలో తెలిపారు. వినియోగదారులు ఉదయం 8:30 నుంచి 9:30 గంటల లోపు 79931 47979 నంబర్‌కు కాల్ చేసి సమస్యలను చెప్పవచ్చు. వాటిని పరిష్కరించడానికి వెంటనే చర్యలు తీసుకుంటారు.
News March 2, 2026
నేడు చిత్తూరు కలెక్టరేట్‌లో PGRS

చిత్తూరు కలెక్టరేట్‌లో సోమవారం ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ సుమిత్ కుమార్ ఆదివారం తెలిపారు. ఉదయం 9:30 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు కలెక్టరేట్‌లోని నూతన సమావేశపు మందిరంలో ఈ కార్యక్రమం ఉంటుందన్నారు. జిల్లా అధికారులు తప్పక హాజరుకావాలని ఆదేశించారు. ప్రజలు అర్జీలు అందించి సమస్యలను పరిష్కరించుకోవచ్చన్నారు.
News March 1, 2026
చౌడేపల్లి: చిరుత దాడిలో దూడ మృతి

చౌడేపల్లి మండలం ముదిరెడ్డిపల్లికి చెందిన రైతు గిరి తన పశువుల మేత కోసం గ్రామ సమీపంలో అటవీ ప్రాంతంలో తోలుకెళ్లాడు. ఈ నేపథ్యంలో ఆదివారం మధ్యాహ్నం పెద్ద వక్కిరి వద్ద పశువులు మేత మేస్తుండగా చిరుత దాడి చేసినట్లు రైతు తెలిపాడు. ఈ దాడిలో దూడ మృతి చెందినట్లు వాపోయాడు. చిరుత పులి దాడి నుంచి పశువులను కాపాడాలని రైతులు కోరుతున్నారు.


