News December 23, 2025

ఇదే లాస్ట్ ఛాన్స్: అక్రమ వలసదారులకు US వార్నింగ్

image

అక్రమ వలసదారులు ఏడాది చివరికి స్వచ్ఛందంగా దేశాన్ని వీడేందుకు రిజిస్టర్ చేసుకుంటే 3వేల డాలర్లు ఇస్తామని ట్రంప్ సర్కారు ప్రకటించింది. స్వదేశాలకు వెళ్లేందుకు ఫ్లైట్ టికెట్ ఫ్రీగా ఇస్తామని చెప్పింది. సెల్ఫ్ డిపోర్టేషన్ ప్రోగ్రామ్‌లో భాగంగా ఇప్పటివరకు చెల్లించే వెయ్యి డాలర్లను $3వేలకు పెంచింది. దేశాన్ని వీడేందుకు వారికి ఇదే చివరి అవకాశమని, తర్వాత అరెస్టు చేస్తామని అధికారులు హెచ్చరిస్తున్నారు.

Similar News

News December 28, 2025

భారత్‌కు హాదీ హంతకులు.. ఖండించిన BSF

image

బంగ్లాదేశ్‌ యువనేత హాదీ హత్య కేసులో నిందితులు భారత్‌లోకి ప్రవేశించారన్న <<18694542>>ప్రచారాన్ని<<>> మేఘాలయ పోలీసులు, BSF ఖండించాయి. కాగా నిందితులు భారత్‌లోకి వచ్చి తురా సిటీకి చేరుకున్నారని ఢాకా పోలీసులు ఆరోపించారు. అయితే దీనిపై భారత్‌కు ఎలాంటి అధికారిక సమాచారం అందలేదన్నారు. అదే విధంగా స్థానికులు, టాక్సీ డ్రైవర్ పాత్రపై కూడా ఆధారాల్లేవన్నారు. అయినప్పటికీ సరిహద్దుల్లో భద్రతను మరింత కట్టుదిట్టం చేశామన్నారు.

News December 28, 2025

కేసీఆర్ వస్తున్నారా?

image

TG: రేపటి నుంచి ప్రారంభం కానున్న అసెంబ్లీ సమావేశాలకు హాజరయ్యేందుకు కేసీఆర్ హైదరాబాద్ వస్తున్నట్లు సమాచారం. ఎర్రవల్లిలోని ఫామ్‌హౌస్‌ నుంచి ఇవాళ ఆయన నందినగర్‌లోని నివాసానికి చేరుకుంటారని ప్రచారం జరుగుతోంది. అయితే సభకు హాజరయ్యేది, లేనిది ఇవాళ రాత్రిలోపు క్లారిటీ రానుంది. కేసీఆర్ అసెంబ్లీకి వెళ్లాలని, ఆయన ప్రసంగం వినడానికి ఎదురుచూస్తున్నామని అభిమానులు చెబుతున్నారు. మీరేమంటారు?

News December 28, 2025

MGNREGAపై కాంగ్రెస్ మొసలి కన్నీరు: కేంద్ర మంత్రి

image

రాజకీయ లబ్ధి కోసమే <<18686966>>ఉపాధి హామీ పథకం<<>>పై కాంగ్రెస్ రాద్ధాంతం చేస్తోందని కేంద్ర మంత్రి శివ్‌రాజ్ సింగ్ చౌహాన్ విమర్శించారు. కొత్త చట్టం ఆమోదం పొందిన తర్వాత ఆ పార్టీ నాయకులు మొసలి కన్నీరు కారుస్తున్నారని ఆరోపించారు. కాంగ్రెస్‌కు చిత్తశుద్ధి, విధానం రెండూ లేవన్నారు. ‘ఓట్ల కోసం ఆ పథకానికి మహాత్మా గాంధీ పేరు పెట్టిందీ, క్రమంగా బడ్జెట్ తగ్గించిందీ ఇదే కాంగ్రెస్. వేతనాలు ఆపిందీ కాంగ్రెస్సే’ అని తెలిపారు.