News January 21, 2025

ఇద్దరు ఐపీఎస్‌ల ప్రేమ వివాహం.. కర్నూలులో పోస్టింగ్..!

image

ఐపీఎస్ భార్యాభర్తలిద్దరూ కర్నూలులో విధులు నిర్వహించనున్నారు. ఎస్పీగా విక్రాంత్ పాటిల్, ఏపీఎస్పీ 2వ బెటాలియన్ కమాండెంట్‌గా ఆయన సతీమణి దీపికను నియమిస్తూ ప్రభుత్వం సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం కాకినాడ ఎస్పీగా విక్రాంత్ పాటిల్, కాకినాడ ఏపీఎస్పీ 3వ బెటాలియన్ కమాండెంట్‌గా దీపిక ఉన్నారు. కాగా, తన అన్న స్నేహితుడైన విక్రాంత్ పాటిల్‌తో పరిచయం ప్రేమగా మారి వివాహం చేసుకున్నారు.

Similar News

News February 14, 2026

కర్నూలు: ఉద్యోగాల పేరుతో రూ.లక్షల్లో మోసం..వ్యక్తి అరెస్టు

image

ఉద్యోగాలు ఇప్పిస్తానని నమ్మించి ఒక్కో వ్యక్తి నుంచి రూ.లక్ష నుంచి రూ.1.50 లక్షల వరకు వసూలు చేసిన ఊటూపల్లి మహేంద్రబాబును కర్నూలు 2 టౌన్ పోలీసులు శుక్రవారం అరెస్ట్ చేశారు. నకిలీ నియామక ఉత్తర్వులు పంపించి పలువురిని మోసం చేసినట్టు వారు తెలిపారు. గతంలో పెట్టుబడుల పేరుతో రూ.కోట్లు వసూలు చేసిన కేసులోనూ అతనిపై కేసు నమోదై ఉందన్నారు. ముద్దాయిని రిమాండ్‌కు తరలించినట్లు డీఎస్పీ జె.బాబు ప్రసాద్ తెలిపారు.

News February 14, 2026

చిప్పగిరి మండలంలో విషాదం

image

చిప్పగిరి మండలం నంచర్లలో విషాదం చోటుచేసుకుంది. గుడిసె సావిత్రి(34) అనారోగ్యంతో మనస్తాపానికి గురై పురుగు మందు మాత్రలు మింగినట్లు పోలీసులు తెలిపారు. భర్త గమనించి ఆమెను ముందుగా గుంతకల్లు ప్రభుత్వ ఆసుపత్రికి, అక్కడి నుంచి మెరుగైన చికిత్స కోసం అనంతపురం ప్రభుత్వ సర్వజన ఆసుపత్రికి తరలించారన్నారు. చికిత్స పొందుతూ ఆమె మృతి చెందినట్లు పేర్కొన్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని వెల్లడించారు.

News February 13, 2026

పరీక్షలను పగడ్బందీగా నిర్వహించండి: సీఎస్

image

ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.విజయానంద్ అన్ని జిల్లాల కలెక్టర్లను, ఎస్పీలను ఆదేశించారు. శుక్రవారం రాష్ట్ర సచివాలయం నుంచి వివిధ ప్రభుత్వ కార్యక్రమాల అమలుపై కలెక్టర్లు, ఎస్పీలతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఆయన సమీక్షించారు. కర్నూలు కలెక్టరేట్ నుంచి జాయింట్ కలెక్టర్ నూరుల్ ఖమర్, ఆర్ఐవోలు పాల్గొన్నారు.