News November 18, 2025

‘ఇద్దరు పిల్లల నిబంధన ఎత్తివేత’ ఆర్డినెన్స్‌కు గవర్నర్ ఆమోదం

image

TG: స్థానిక ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులకు ఇద్దరి కంటే ఎక్కువ సంతానం ఉండకూడదన్న <<18069484>>నిబంధనను <<>>ప్రభుత్వం ఇటీవల ఎత్తివేసింది. ఈ రూల్‌ను తొలగిస్తూ జారీ చేసిన ఆర్డినెన్స్‌కు గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ఆమోదం తెలిపారు. దీంతో ఇద్దరి కంటే ఎక్కువ మంది పిల్లలున్నా సర్పంచ్, వార్డ్ మెంబర్, MPTC, ZPTC ఎన్నికల్లో పోటీ చేయొచ్చు. 1994లో ఉమ్మడి APలో జనాభా నియంత్రణ లక్ష్యంగా ఈ నిబంధన తీసుకొచ్చారు.

Similar News

News November 18, 2025

1383 పోస్టులకు నోటిఫికేషన్

image

దేశవ్యాప్తంగా ఉన్న ఎయిమ్స్ హాస్పిటల్స్, కేంద్ర ప్రభుత్వ ఇన్‌స్టిట్యూట్స్‌లో 1383 గ్రూప్ B, గ్రూప్ C పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. అర్హతగల అభ్యర్థులు డిసెంబర్ 2వరకు అప్లై చేసుకోవచ్చు. పోస్టును బట్టి టెన్త్, ఇంటర్, డిప్లొమా, డిగ్రీ, పీజీ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. వయసు 18 నుంచి 30ఏళ్ల మధ్య ఉండాలి. రాత పరీక్ష ద్వారా ఎంపిక చేస్తారు. వెబ్‌సైట్. https://aiimsexams.ac.in/

దేశాధినేతలు.. మరణశిక్షలు

image

బంగ్లాదేశ్‌ మాజీ ప్రధాని షేక్ హసీనాకు అక్కడి తాత్కాలిక ప్రభుత్వం నిన్న <<18311462>>మరణశిక్ష<<>> విధించింది. ఇలా దేశాధినేతలు ఉరిశిక్ష ఎదుర్కోవడం గతంలోనూ జరిగింది. పాక్‌లో జుల్ఫికర్ అలీ బుట్టో, తుర్కియేలో అద్నాన్ మెండెరెస్, ఇరాక్ నియంత సద్దాం హుస్సేన్‌లకు మరణశిక్ష అమలైంది. సౌత్ కొరియాలో చున్ డూ హ్వాన్‌కు విధించిన ఉరిశిక్షను యావజ్జీవ కారాగార శిక్షగా మార్చారు. పాక్‌లో ముషారఫ్‌ మరణశిక్షను తర్వాత రద్దు చేశారు.