News November 19, 2025
ఇన్‌ఛార్జుల పాలనలో ‘అప్పన్న’ సేవలు.. ఇంకెన్నాళ్లు?

సింహాచలం దేవస్థానానికి పూర్తిస్థాయి ఈవో లేకపోవడంతో ఇన్‌ఛార్జీల పాలనలోనే నెట్టుకొస్తున్నారు. 2019 నుంచి ఇప్పటి వరకు 16సార్లు ఈవోలను మర్చారు. వెయ్యేళ్లకు పైగా చరిత్ర, వేల ఎకరాల భూములన్న దేవస్థానానికి పూర్తిస్థాయి ఈవో లేకపోవడంతో పాలన గాడి తప్పుతోంది. భక్తుల సేవల్లో కూడా ఇబ్బందులు తలెత్తుతున్నాయి. ప్రస్తుతం విశాఖ అసిస్టెంట్ కమిషనర్‌గా ఉన్న సుజాత పూర్తిస్థాయి అదనపు బాధ్యతలతో ఈవోగా కొనసాగుతున్నారు.
Similar News
News November 19, 2025
అన్నదాతకు ప్రభుత్వం అండ: కలెక్టర్

అన్నదాత సుఖీభవ-పీఎం కిసాన్ 2025-26 2వ విడత కింద జిల్లాలో 2,72,757 మంది రైతులకు రూ.181.51 కోట్లు జమయ్యాయని కలెక్టర్ డా. ఏ.సిరి తెలిపారు. కోడుమూరు ఆర్.కొంతలపాడులో జరిగిన కార్యక్రమంలో కలెక్టర్, ఎమ్మెల్యే బొగ్గుల దస్తగిరి పాల్గొన్నారు. ఉల్లి, మిర్చి, పత్తి పంటల సమస్యలపై ప్రభుత్వం వెంటనే స్పందిస్తోందని కలెక్టర్ తెలిపారు. జిల్లాలో 11 పత్తి మిల్లులు పనిచేస్తున్నాయన్నారు.
News November 19, 2025
రిస్క్‌లో 350 కోట్లమంది వాట్సాప్ కాంటాక్ట్స్?

డేటా లీకేజీతో వాట్సాప్ వినియోగదారుల ప్రైవసీ ప్రమాదంలో పడనున్నట్లు వియన్నా యూనివర్సిటీ హెచ్చరించింది. ఆ యూనివర్సిటీ రీసెర్చర్స్ వాట్సాప్‌లో భారీ భద్రతా లోపాన్ని గుర్తించారు. వరల్డ్ వైడ్‌గా ఉన్న 350 కోట్లమంది యూజర్ల కాంటాక్ట్స్ లీక్ అయ్యే ప్రమాదం ఉన్నట్లు వార్నింగ్ ఇచ్చారు. హ్యాకర్లు లేదా వేరే వ్యక్తులు ఈ కాంటాక్ట్ నంబర్లను చోరీ చేసే అవకాశమున్నట్లు తెలిపారు.
News November 19, 2025
MNCL: ప్రతి మహిళకు చీరలు అందేలా చూడాలి

ఇందిరా గాంధీ జయంతిని పురస్కరించుకొని రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న ఇందిరమ్మ చీరలు ప్రతి మహిళకు అందేలా చర్యలు తీసుకోవాలని సీఎం రేవంత్ రెడ్డి సూచించారు. బుధవారం హైదరాబాద్‌లోని రాష్ట్ర సచివాలయం నుంచి అన్ని జిల్లాల కలెక్టర్లతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ప్రభుత్వం మహిళలు ఆర్థిక స్వావలంబన పొందేందుకు కృషి చేస్తోందన్నారు.


