News January 3, 2026

ఇన్‌ఛార్జ్ కలెక్టర్‌గా జేసీ వై.మేఘా స్వరూప్

image

తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి ముస్సోరీలో జరిగే శిక్షణ కార్యక్రమానికి హాజరుకానున్నారు. శనివారం వెల్లడించిన వివరాల ప్రకారం.. ఈ నెల 5 నుంచి 30 వరకు ఆమె లాల్ బహదూర్ శాస్త్రి నేషనల్ అకాడమీలో ఉండనున్నారు. కలెక్టర్ గైర్హాజరీలో జేసీ వై.మేఘా స్వరూప్ జిల్లా ఇన్‌ఛార్జ్ కలెక్టర్‌గా బాధ్యతలు నిర్వహించనున్నారు. ఈ మేరకు అధికారిక ఉత్తర్వులు వెలువడ్డాయి.

Similar News

News February 13, 2026

సీఎం చంద్రబాబుతో ఎమ్మెల్యే బత్తుల భేటీ

image

సీఎం చంద్రబాబుతో రాజానగరం MLA బత్తుల బలరామకృష్ణ గురువారం జరిగిన అసెంబ్లీ సమావేశాల అనంతరం భేటీ అయ్యారు. నియోజకవర్గ అభివృద్ధికి సంబంధించి పలు అంశాలతో కూడిన వినతి పత్రాన్ని సీఎంకు అందించారు. 2027 పుష్కరాలకు రాజానగరం నియోజకవర్గానికి ప్రాధాన్యత నిచ్చి తగిన నిధులు కేటాయించాలని, సాగు, తాగునీటి ప్రాజెక్టులకు సహకారం అందించాలని కోరారు. వాటిపై సీఎం సానుకూలంగా స్పందించినట్లు చెప్పారు.

News February 12, 2026

గోదావరి పుష్కరాలు.. ట్రాఫిక్ మళ్లింపుపై కలెక్టర్ పరిశీలన

image

2027 గోదావరి పుష్కరాల నేపథ్యంలో నగరంలోకి వివిధ ప్రాంతాల నుంచి వచ్చే వాహనాల రాకపోకలు, ట్రాఫిక్ మళ్లింపు, పార్కింగ్ సౌకర్యాల ఏర్పాటుపై కలెక్టర్ కీర్తి చేకూరి బుధవారం క్షేత్ర స్థాయిలో పరిశీలించారు. ఆర్టీసీ బస్సులు, ప్రైవేట్ ట్రావెల్స్, మోటార్ సైకిళ్లు తదితర వాహనాలకు సంబంధించి సమగ్ర రూట్ మ్యాప్ రూపొందించాల్సిన అవసరంపై అధికారులతో చర్చించారు. మహాశివరాత్రి ఏర్పాట్లపై దిశానిర్దేశం చేశారు.