News November 18, 2025
ఇన్‌ఛార్జ్ HM, పీడీలకు షోకాజ్ నోటీసులు: DEO

పిడుగురాళ్ల మండలం కరాలపాడు జెడ్పీ ఉన్నత పాఠశాలలో విద్యార్థులతో మట్టి పనులు చేయించినట్లుగా సామాజిక మాధ్యమాల్లో వచ్చిన వార్తలపై డీఈవో చంద్రకళ స్పందించారు. పాఠశాల ఇన్‌ఛార్జ్ హెచ్ఎం రాజు నాయక్, ఫిజికల్ డైరెక్టర్ అశోక్ కుమారిలకు షోకాజ్ నోటీసులు జారీ చేశారు. ఈ అంశంపై కమిటీ వేసి, సంబంధిత అధికారులు నిర్లక్ష్యం వహించినట్లు తేలితే చర్యలు తీసుకుంటామని తెలిపారు.
Similar News
News November 18, 2025
HYD: మిద్దె తోటలతో ఎన్నో ప్రయోజనాలు

HYDలో మిద్దె తోటల పెంపకం జోరందుకుంది. ఈ పద్ధతితో బహుళ ప్రయోజనాలు ఉన్నాయని శాస్త్రవేత్తలు తెలిపారు. ఇంట్లోనే కూరగాయలు, ఆకుకూరలు పండించుకుని నేచురల్ ఫుడ్ తీసుకోవచ్చు. మరోవైపు భవన ఉష్ణోగ్రతలు తగ్గతుందని పేర్కొన్నారు. నీటి ఉపయోగం పెద్దగా లేకుండా ఈజీగా ఫ్రెష్‌గా వండుకోవచ్చని డా.విష్ణు వందన తెలిపారు. ఉద్యానశాఖ నెలలో రెండో శనివారంలో ఒక్కోచోట అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తుందని పేర్కొన్నారు.

ప్రధాని, రాష్ట్రపతి పర్యటనపై సమీక్ష: అడిషనల్ DG

బాబా జయంతి వేడుకలకు ప్రధాని, రాష్ట్రపతి పర్యటనల నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర అడిషనల్ DG పోలీసు అధికారులకు సూచించారు. పుట్టపర్తిలో సోమవారం రాత్రి పోలీసు అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈనెల 19న భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, 22 &23 తేదీల్లో రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, పలువురు ముఖ్యమంత్రులు, గవర్నర్లు, వివిధ రాష్ట్రాల నుంచి వీవీఐపీలు వస్తున్న నేపథ్యంలో అందరిని అలెర్ట్ చేశారు.