News February 14, 2026
ఇన్‌స్టాగ్రామా.. ఛేంజింగ్ రూమా?

సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ఇన్‌స్టాలో అశ్లీలం హద్దుమీరింది. ముఖ్యంగా ఇన్‌ఫ్లుయెన్సర్ల పేరిట కొందరు అమ్మాయిలు ఇష్టారీతిగా ప్రవర్తిస్తున్నారు. లైక్‌ల కోసం డ్రెస్ ఛేంజింగ్ వీడియోలను ఇన్‌స్టాలో పంచుకుంటున్నారు. ‘మరింత’ చూపిస్తామంటూ సబ్‌స్క్రిప్షన్ పేరిట బరితెగిస్తున్నారు. ప్రైవసీకి సంబంధించిన దృశ్యాలు ఇలా బజార్లో పెడుతుండటంపై ఆందోళన వ్యక్తమవుతోంది. ఇలాంటి వీడియోలకు అడ్డుకట్ట వేయాల్సిన అవసరం ఉంది.
Similar News
News February 16, 2026
నేడు అమరావతిలో బిల్ గేట్స్ పర్యటన

AP: టెక్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ ఫౌండర్ బిల్ గేట్స్ నేడు అమరావతికి రానున్నారు. సచివాలయంలో CM చంద్రబాబు, DyCM పవన్ కళ్యాణ్, మంత్రి లోకేశ్‌తో ఆయన భేటీ కానున్నారు. గేట్స్ ఫౌండేషన్ సహకారంతో కొనసాగుతున్న విద్య, వైద్యం, వ్యవసాయ రంగాల ప్రాజెక్టులను విస్తరించడంపై చర్చలు జరపనున్నారని సమాచారం. రియల్‌టైమ్ గవర్నెన్స్ సెంటర్, సంజీవని ప్రాజెక్ట్, టెక్నాలజీ ఆధారిత వ్యవసాయ విధానాలను ఆయన పరిశీలించనున్నారు.
News February 16, 2026
ఉపవాస విరమణ ఏ సమయంలో చేయాలంటే?

నిన్నటి శివరాత్రి ఉపవాసాన్ని ఈరోజు సూర్యోదయం తర్వాత విరమించాలి. దీనినే ‘పారణ’ అంటారు. చతుర్దశి తిథి ముగిసేలోపు ఉపవాసం విరమించాలి. అందుకు 6.42AM – 3.10PM అనువైన సమయమని పండితులు చెబుతున్నారు. ‘స్నానాది కార్యక్రమాలు ముగించుకుని శివదర్శనం చేసాక ఆహారం తీసుకోవాలి. రాత్రంతా జాగరణ చేసిన వారు పారణ తర్వాత నిద్రపోవాలి. క్రమశిక్షణతో ఉపవాసం వదిలితే శివానుగ్రహంతో సంపూర్ణ ఆరోగ్య ఫలం లభిస్తుంది’ అంటున్నారు.
News February 16, 2026
ఉచితంగా సర్వైకల్ క్యాన్సర్ వ్యాక్సిన్!

TG: సర్వైకల్(గర్భాశయ) క్యాన్సర్ ముప్పు నుంచి అమ్మాయిలను కాపాడేందుకు రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. 14-15 ఏళ్ల వయసున్న 4 లక్షల మంది బాలికలకు HPV వ్యాక్సిన్‌ను త్వరలో ఉచితంగా పంపిణీ చేయనుంది. మార్కెట్లో ఈ టీకా ఒక్కో డోసు రూ.2-4 వేలు ఉండటం గమనార్హం. రాష్ట్రంలో ఏటా 4 వేల మంది ఈ క్యాన్సర్ బారిన పడుతున్నారు. దీంతో వ్యాధి రాకముందే అరికట్టేందుకు ప్రభుత్వం ఫ్రీగా వ్యాక్సిన్ వేయనుంది.


