News December 1, 2025

ఇన్‌స్టాగ్రామ్‌‌తో పిల్లల్ని పెంచడం కరెక్టేనా?

image

పిల్లల ఫుడ్ నుంచి హెల్త్ వరకు పేరెంట్స్ ఇన్‌స్టా ఇన్‌ఫ్లూయెన్సర్స్‌నే ఫాలో అవుతున్నారు. ఈ Instagram పేరెంటింగ్ కొన్నిసార్లు ఫర్వాలేదు కానీ, ప్రతిసారీ, ప్రతి కిడ్‌కూ సెట్ కాదని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ప్రతి బేబీ లైఫ్, పరిస్థితులు, బిహేవియర్ ప్రత్యేకం కాబట్టి మన పెద్దలు, డాక్టర్ల సలహా పాటించడం మంచిదని సూచిస్తున్నారు. IG టిప్స్‌తో రిజల్ట్స్ తేడా అయితే మనం ఒత్తిడికి గురయ్యే ప్రమాదం ఉంది.

Similar News

News March 29, 2026

అత్యాచార బాధితుల పేర్లను తీర్పుల్లోనూ వాడరాదు: సుప్రీంకోర్టు

image

అత్యాచార బాధితులు, వారి కుటుంబీకుల పేర్లను తీర్పుల్లోనూ ప్రస్తావించరాదని అన్ని హైకోర్టులకు సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. వారిని గుర్తించే అవకాశమున్న ఏ వివరాలనూ ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియాలో చెప్పరాదని 2018లోనే అత్యున్నత న్యాయస్థానం తీర్పు ఇచ్చిందంది. లైంగిక నేరాల బాధితులకు సమాజంలో ఇబ్బందులు కలగకుండా ఇలా చేసినట్లు పేర్కొంది. ఓ బాలిక వివరాలను HP హైకోర్టు ప్రస్తావించడాన్ని తప్పుపట్టింది.

News March 29, 2026

ఫీటల్ ఆల్కహాల్ సిండ్రోమ్ గురించి తెలుసా?

image

ప్రెగ్నెన్సీలో మహిళలు మద్యం తాగడం వల్ల బిడ్డకు ఫీటల్ ఆల్కహాల్ సిండ్రోమ్ ఏర్పడే ప్రమాదం పెరుగుతుందంటున్నారు నిపుణులు. దీంతో శిశువుకు శారీరక, మానసిక లోపాలు ఏర్పడతాయంటున్నారు. ప్రెగ్నెన్సీలో ఆల్కహాల్ తీసుకుంటే అది పిండంలోకి సులువుగా చేరుతుంది. కాలేయం పూర్తి స్థాయిలో అభివృద్ధి చెందకపోవడం వల్ల ఆల్కహాల్ శిశువు శరీరంలో పేరుకుపోతుంది. దీంతో శిశువుకు పోషకాలు, ఆక్సిజన్ అందక అభివృద్ధికి ఆటంకం కలుగుతుంది.

News March 29, 2026

యుద్ధం.. కండోమ్‌ల కొరత

image

పశ్చిమాసియా యుద్ధ ప్రభావం కండోమ్‌లపైనా పడింది. వాటి తయారీ కోసం వినియోగించే సిలికాన్ ఆయిల్ (లూబ్రికేషన్ కోసం) లభించట్లేదని HLL లైఫ్ కేర్, మాన్‌కైండ్ ఫార్మా తెలిపాయి. కండోమ్ చిరిగిపోకుండా ఉండేందుకు వాడే అమ్మోనియా ధరలు 40-50% పెరిగాయని పేర్కొన్నాయి. 86% అమ్మోనియాను గల్ఫ్ నుంచే దిగుమతి చేసుకుంటామని, ఇప్పుడు హార్ముజ్ మూసివేతతో ఇబ్బంది కలుగుతోందని వివరించారు. దీంతో కండోమ్‌ల ధరలు పెరిగే అవకాశం ఉంది.