News April 7, 2025
ఇన్‌స్టాగ్రామ్‌లో ప్రేమ.. పెద్దల సమక్షంలో పెళ్లి!

ఆదోని మండల పరిధిలోని పెద్దహరివాణం గ్రామానికి చెందిన ఓ యువకుడు ప్రకాశం జిల్లా ఒంగోలు మండలానికి చెందిన యువతికి ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయం అయ్యారు. ఇద్దరి మనసులు కలవడంతో పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. ఇరు కుటుంబాల పెద్దలను ఒప్పించి శ్రీరామనవమి రోజున ఒక్కటయ్యారు. నిండు నూరేళ్లు చల్లగా జీవించాలని కుటుంబ సభ్యులు వారిని మనస్ఫూర్తిగా ఆశీర్వదించారు.
Similar News
News April 9, 2025
సంగారెడ్డి: 332 మొబైల్ ఫోన్లు రికవరీ: ఎస్పీ

CEIR ద్వారా ఫిర్యాదు వచ్చిన 332 మొబైల్ ఫోన్లను రికవరీ చేసినట్లు ఎస్పీ పరితోష్ పంకజ్ తెలిపారు. సంగారెడ్డి జిల్లా ఎస్పీ కార్యాలయంలో మొబైల్ ఫోన్ రికవరీ మేళా బుధవారం నిర్వహించారు. CEIR పోర్టల్ ప్రారంభమైన నాటి నుంచి 9,878 ఫిర్యాదులు రాగా 2,150 ఫోన్లను గుర్తించి బాధితులకు అందించినట్లు చెప్పారు. 15 రోజుల క్రితం ఏర్పాటు చేసిన స్పెషల్ టీం ద్వారా మూడో నెల 32 ఫోన్ లను రికవరీ చేసినట్లు పేర్కొన్నారు.
News April 9, 2025
సీతారాముల వారి కళ్యాణానికి పటిష్ట బందోబస్తు

ఒంటిమిట్ట శ్రీ కోదండరాముని బ్రహ్మోత్సవాలలో భాగంగా ఈ నెల 11న శుక్రవారం నిర్వహించనున్న సీతారాముల వారి కళ్యాణం సందర్భంగా పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేసినట్లు జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ పేర్కొన్నారు. 2 వేలకు మంది పైగా పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేశామన్నారు. బందోబస్తు విధుల్లో నలుగురు అదనపు ఎస్పీలు, 25 మంది డీఎస్పీలు, 73 మంది సీఐలు, 177 మంది ఎస్ఐలు, 1700 మంది పోలీసు సిబ్బంది ఉంటారన్నారు.
News April 9, 2025
చంద్రగిరిలో మైనర్ బాలిక పరువు హత్య..?

చంద్రగిరి(M) నరసింగాపురంలో దారుణం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన నిఖిత(17)ను శుక్రవారం కన్న తల్లిదండ్రులే చంపి కననం చేసినట్లు సమాచారం. ప్రేమ వ్యవహారమే ఈ ఘటనకు కారణం అని తెలుస్తోంది. దీనిపై పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.