News March 10, 2026
ఇన్‌స్టాలో సంజూ హవా..

T20WCలో అద్భుత ప్రదర్శనతో సంజూ శాంసన్ క్రేజ్ విపరీతంగా పెరుగుతోంది. సూపర్-8లో వెస్టిండీస్‌తో మ్యాచుకు ముందు ఇన్‌స్టాగ్రామ్‌లో శాంసన్‌కు 12.1 మిలియన్ల ఫాలోవర్లు ఉండేవారు. ఆ మ్యాచుతో పాటు సెమీఫైనల్, ఫైనల్లోనూ చెలరేగడంతో ప్రస్తుతం ఆ సంఖ్య 17.5 మిలియన్లకు చేరింది. ఫైనల్లో టీమ్ ఇండియా విజయం తర్వాత ఏకంగా 1 మిలియన్‌కు పైగా నెటిజన్లు అతడిని ఫాలో కొట్టడం విశేషం.
Similar News
News March 29, 2026
దూసుకుపోతున్న విశాఖ పోర్టు.. 9 దశాబ్దాల రికార్డు బ్రేక్!

AP: విశాఖ పోర్టు చరిత్రాత్మక మైలురాయిని అందుకుంది. 2025-26 ఆర్థిక సంవత్సరంలో 362 రోజుల్లో 90.29మిలియన్ మెట్రిక్ టన్నుల సరకు రవాణా చేసి అత్యధిక వార్షిక రికార్డు నమోదు చేసింది. గతేడాది నమోదైన 82.62MMTను అధిగమించింది. 9 దశాబ్దాల చరిత్రలో ఇదే అత్యుత్తమ ప్రదర్శన కావడం గమనార్హం. సమర్థవంతమైన నిర్వహణ, వ్యూహాత్మక ప్రణాళికలు, సిబ్బంది కృషి, భాగస్వామ్య సంస్థల సమన్వయంతోనే ఇది సాధ్యమైందని అధికారులు తెలిపారు.
News March 29, 2026
IPL: ధోనీ ఫ్యాన్స్‌కు బ్యాడ్‌న్యూస్

ఐపీఎల్-2026లో తొలి రెండు వారాల్లో జరిగే మ్యాచులకు ధోనీ దూరమైనట్లు CSK ఇటీవల ప్రకటించింది. కానీ ఆయన ఏప్రిల్ చివరి వారం వరకూ మ్యాచులు ఆడకపోవచ్చని క్రీడా వర్గాలు పేర్కొన్నాయి. కండరాల గాయంతో బాధపడుతున్న ఆయన దాదాపు 6 మ్యాచులకు దూరం కానున్నట్లు టీమ్ వర్గాలు చెప్పినట్లు తెలిపాయి. కాగా CSK రేపు RR, ఏప్రిల్ 3న PBKS, 5న RCB, 11న DC, 14న KKR, 18న SRH, ఏప్రిల్ 23న MIతో తలపడనుంది.
News March 29, 2026
మరో 2 రోజులే గడువు!

దేశంలో మావోయిస్టుల నిర్మూలనకు కేంద్ర మంత్రి అమిత్ షా విధించిన గడవు మరో 2 రోజుల్లో(మార్చి 31) ముగుస్తోంది. ఆపరేషన్ కగార్‌తో వందల మంది నేలకొరగగా, ఇంకెంతో మంది లొంగిపోయారు, లొంగిపోతున్నారు. ఇందులో తిప్పిరి తిరుపతి(దేవ్‌జీ), మల్లా రాజిరెడ్డి, మల్లోజుల, పాపారావు వంటి అగ్ర నేతలు ఉన్నారు. అయితే కీలక నేత గణపతి ఇంకా సరెండర్ కాలేదు. ఆయన నేపాల్‌లో ఉన్నారని ఈ నెల 31న లొంగిపోతారని వార్తలు వస్తున్నాయి.


