News February 26, 2026

ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫిజిక్స్ భువనేశ్వర్‌లో అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులు

image

భువనేశ్వర్‌లోని ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫిజిక్స్ 7 అసిస్టెంట్ ప్రొఫెసర్/రీడర్ పోస్టులకు అప్లై చేయడానికి ఎల్లుండే ఆఖరు తేదీ. థియోరిటికల్ హై ఎనర్జీ ఫిజిక్స్, థియోరిటికల్ కండెన్స్ మ్యాటర్ ఫిజిక్స్, ఎక్సపర్మెంటల్ కండెన్స్‌డ్ మ్యాటర్ ఫిజిక్స్ విభాగంలో పోస్టులు ఉన్నాయి. అసిస్టెంట్ ప్రొఫెసర్‌కు గరిష్ఠ వయసు 35ఏళ్లు కాగా.. రీడర్‌కు 38ఏళ్లు. వెబ్‌సైట్: https://www.iopb.res.in

Similar News

News February 27, 2026

విడాకుల పిటిషన్‌లో విజయ్‌పై భార్య ఆరోపణలు

image

విజయ్ ఓ నటితో కలిసి విదేశాల్లో పబ్లిక్ ఈవెంట్లకు హాజరయ్యేవారని ఆయన భార్య సంగీత <<19254560>>విడాకుల<<>> పిటిషన్‌లో పేర్కొన్నారు. ఆ ఫొటోలను సదరు నటి సోషల్ మీడియాలో షేర్ చేశారని తెలిపారు. ఆమెతో వివాహేతర సంబంధానికి ముగింపు పలుకుతానని తొలుత విజయ్ మాట ఇచ్చి సంబంధాన్ని కొనసాగిస్తూనే ఉన్నారని చెప్పారు. అతడి నిర్లక్ష్యం కారణంగా తాను ఒంటరినయ్యానని వెల్లడించారు. వివాహేతర సంబంధం ఇలాగే కొనసాగిస్తే ఆమె పేరు బయటపెడతానన్నారు.

News February 27, 2026

₹47,776 CRతో ఏపీ అక్రమ ప్రాజెక్టులు: TG

image

TG: కృష్ణా నీటిని అక్రమంగా తరలించేందుకు AP ₹47,776 CRతో అనుమతుల్లేని నిర్మాణాలు చేపడుతోందని KRMBకి TG ఫిర్యాదు చేసింది. కొత్త ప్రాజెక్టులతో పాటు పాతవాటి సామర్థ్యం పెంచుతోందని ఆరోపించింది. పోతిరెడ్డిపాడు కెపాసిటీ పెంపు, హంద్రీ నీవా, గాలేరు నగరి, SRBC, తుంగభద్ర ప్రాజెక్టులకు శ్రీశైలం నుంచి నీటిని తరలించాలని చూస్తోందని విమర్శించింది. కేటాయింపు లేకున్నా 114TMCలు వాడుకోవాలని యత్నిస్తోందని పేర్కొంది.

News February 27, 2026

విజయ్-రష్మిక పెళ్లి.. రక్షిత్ శెట్టిని తెరపైకి తెస్తున్న నెటిజన్లు!

image

విజయ్-రష్మిక పెళ్లి చేసుకోవడంతో కన్నడ నెటిజన్లు రక్షిత్ శెట్టి పేరును తెరపైకి తెస్తున్నారు. ‘కిరిక్ పార్టీ’ సినిమాతో రష్మికను ఇండస్ట్రీకి పరిచయం చేసింది రక్షితేనని గుర్తు చేస్తున్నారు. వారిద్దరూ ప్రేమించుకుని 2017లో ఎంగేజ్‌మెంట్ చేసుకోగా.. రిలేషన్ కంటే కెరీర్ ఇంపార్టెంట్ అంటూ రష్మిక ఏడాదికే అతడిని వదిలేసిందని పోస్టులు చేస్తున్నారు. కాగా ఎంగే‌జ్‌మెంట్ సమయంలో రక్షిత్ వయసు 34, రష్మిక వయసు 21.