News October 14, 2025

ఇన్‌స్పెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్‌తో కలెక్టర్ సమావేశం

image

ఏలూరు కలెక్టరేట్ గోదావరి సమావేశ మందిరంలో మంగళవారం జిల్లా స్థాయి పారిశ్రామిక భద్రతా కమిటీ క్రైసిస్ గ్రూపుల కమిటీ సమావేశాన్ని ఇన్‌స్పెక్టర్ ఆఫ్ ఫాక్టరీస్, సేఫ్టీ అధికారులతో కలసి కలెక్టర్ వెట్రిసెల్వి అధ్యక్షతన సమావేశం నిర్వహించారు. జిల్లాలో కేటగిరీల వారీగా 36 పరిశ్రమలు మీద భద్రత ప్రమాణాలపై సుదీర్ఘంగా చర్చించారు. ప్రతి ఫ్యాక్టరీలో ఎస్ఓను ఏర్పాటు చేయాలన్నారు.

Similar News

News October 15, 2025

పిల్లల రక్షణ, విద్యకు పక్కా ప్రణాళిక: కలెక్టర్ హరిచందన

image

పిల్లల రక్షణ, నాణ్యమైన విద్యాబోధన కోసం క్యాలెండర్ ప్రకారం ప్రణాళికలు సిద్ధం చేసి, పక్కాగా అమలు చేయాలని అనుబంధ శాఖల అధికారులను HYD కలెక్టర్ హరిచందన ఆదేశించారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో జరిగిన ‘క్లాప్'(సిటీ లెవల్ యాక్షన్ ప్లాన్) అవగాహన సదస్సులో ఆమె పాల్గొన్నారు. పిల్లల రక్షణ, నాణ్యమైన విద్య, స్వచ్ఛమైన ఆహారం అందించుటలో ఈ ప్రణాళికలు కీలకం కావాలని ఆమె సూచించారు.

News October 15, 2025

కాకినాడ సీ పోర్టులో ఎస్పీ ఆకస్మిక తనిఖీలు

image

కాకినాడ జిల్లా ఎస్పీ జి.బిందు మాధవ్‌ మంగళవారం కాకినాడ సీ పోర్టు పరిధిలో ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన పలు విభాగాలను సందర్శించి భద్రతా చర్యలను సమీక్షించారు. పోర్టులో నిర్వహిస్తున్న రికార్డులను పరిశీలించారు. పోర్టు భద్రతను బలోపేతం చేయడానికి సాంకేతికత, అలర్ట్‌ రెస్పాన్స్‌ సిస్టమ్‌ను మరింత సమర్థవంతంగా వినియోగించుకోవాలని సిబ్బందికి సూచించారు.

News October 15, 2025

కొండా సురేఖ ఓఎస్డీపై వేటు

image

మంత్రి కొండా సురేఖకు కాంగ్రెస్ ప్రభుత్వం షాక్ ఇచ్చిందనే చెప్పవచ్చు. సురేఖ ప్రైవేట్ ఓఎస్డీ సుమంత్‌ను పదవి నుంచి టర్మినేట్ చేసింది. సురేఖ అటవీ శాఖలో డిప్యుటేషన్లు, బదిలీలు అంతా సుమంత్ చెప్పినట్లే జరిగేవి అంటూ ఆరోపణలు గుప్పుమన్నాయి. ఐఏఎస్ స్థాయి వ్యక్తులకు సైతం ఆర్డర్లు వేసే స్థాయికి సుమంత్ ఎదిగారనే ఆరోపణలుండగా.. పాలనాపరమైన కారణాలతో పీసీబీ టర్మినేట్ చేసింది.