News February 16, 2025
ఇన్ శానిటరీ లెట్రిన్ జిల్లాగా కామారెడ్డి: కలెక్టర్

కామారెడ్డిని ఇన్ శానిటరీ లెట్రిన్ రహిత జిల్లాగా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ ప్రకటించారు. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు జిల్లాలో అన్ని గ్రామపంచాయతీ, మున్సిపాలిటీల్లో గతంలో నిర్వహించిన సర్వే ప్రకారం.. మ్యానువల్ స్కావెంజర్లు లేనట్లు తేలిందన్నారు. దీనిపై గత నెల 24వ తేదీన అభ్యంతరాలను కోరగా, ఎలాంటి అభ్యంతరాలు రాలేదన్నారు. ఇన్ శానిటరీ లెట్రిన్ జిల్లాగా ప్రకటిస్తున్నట్లు కలెక్టర్ వెల్లడించారు.
Similar News
News November 10, 2025
సేఫ్ పాస్‌వర్డ్ ఇలా సెట్ చేసుకోండి

సైబర్ నేరాలు, హ్యాకింగ్స్ విపరీతంగా పెరిగిపోతున్నందున <<18240768>>పాస్‌వర్డ్‌లపై<<>> ప్రత్యేక శ్రద్ద పెట్టాలని సూచిస్తున్నారు టెక్ నిపుణులు. పాస్‌వర్డ్‌ను ఎలా సెట్ చేసుకుంటే సేఫ్ అనే విషయాలను చెబుతున్నారు. అప్పర్‌కేస్, లోయర్‌కేస్ లెటర్స్, నంబర్స్, సింబల్స్ కాంబోలో పాస్‌వర్డ్ సెట్ చేసుకోవాలని అంటున్నారు. ఫోన్ నంబర్లు, బర్త్‌డేలు, ఫ్యామిలీ మెంబర్ల పేర్లను పాస్‌వర్డ్‌లుగా పెట్టుకోకూడదని హెచ్చరిస్తున్నారు.
News November 10, 2025
కర్బూజాలో బూజు తెగులును ఎలా నివారించాలి?

కర్బూజాలో బూజు తెగులు ఒక సాధారణ శిలీంధ్ర వ్యాధి. ఇది ఆకులు, కాండం, పండుపై తెల్లటి లేదా బూడిద రంగు బూజు మచ్చలను ఏర్పరుస్తుంది. ఈ బూజు తెగులు నివారణకు 200 లీటర్ల నీటిలో మెటలాక్సిల్ 8%+మాంకోజెబ్ 64% డబ్ల్యూ.పి. 72% 400 గ్రా. లేదా డైమెథోమార్ఫ్ 9%+మాంకోజెబ్ 60% డబ్ల్యూ.పి. 300 గ్రా.లలో ఏదైనా ఒకదానితో పాటు జిగురు పదార్థం 100ml లను కలిపి మొక్కలకు సరిపడా ద్రావణాన్ని పిచికారీ చేసుకోవాలి.
News November 10, 2025
పెరుగుతున్న దగ్గు కేసులు.. ఈ సిరప్‌లు డేంజర్!

చలి పెరగడంతో పిల్లల్లో దగ్గు, జలుబు <<18247158>>సమస్యలు<<>> పెరుగుతున్నాయి. దీంతో చాలామంది డాక్టర్ సలహా లేకుండా మెడికల్ షాపుల్లో దగ్గు సిరప్‌లు తీసుకొచ్చి తాగిస్తుంటారు. ఇటీవల దగ్గు సిరప్ తాగి పిల్లలు చనిపోయిన నేపథ్యంలో తల్లిదండ్రులు అప్రమత్తంగా ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు. కాగా Relife CF, Respifresh-TR సిరప్‌లను TG ప్రభుత్వం నిషేధించింది. ‘కోల్డ్రిఫ్’ & ‘రెస్పిఫ్రెష్ TR’ సిరప్‌లను WHO వాడొద్దని చెప్పింది.


