News November 11, 2025
ఇప్పటివరకు 7,890 MTల ధాన్యం కొనుగోళ్లు: కలెక్టర్

PDPL జిల్లాలో నాణ్యమైన ధాన్యాన్ని చివరి గింజ వరకు మద్దతు ధరకు కొనుగోలు చేస్తామని కలెక్టర్ కోయ శ్రీహర్ష తెలిపారు. ఇప్పటివరకు 1,140 మంది రైతుల నుంచి 7,890 MTల ధాన్యం కొనుగోలు చేసి, రూ.18.85 కోట్లు చెల్లించామని పేర్కొన్నారు. 333 కొనుగోలు కేంద్రాలు ప్రారంభించామని, నాణ్యతా ప్రమాణాలు పాటిస్తే వెంటనే కొనుగోలు జరుగుతుందని తెలిపారు. రైతులు ఆందోళన చెందవద్దని, ప్రతి గింజకూ న్యాయం చేస్తామని స్పష్టం చేశారు.
Similar News
News November 11, 2025
ముంబై ఆ ఇద్దరిని వదిలేయాలి: హెడెన్

IPL రిటెన్షన్స్ ప్రకటనకు ముందు ముంబై ఇండియన్స్‌కు ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ హెడెన్ కీలక సూచనలు చేశారు. గత వేలంలో అధిక ధరకు కొనుగోలు చేసిన బౌల్ట్(₹12.5Cr), దీపక్ చాహర్(₹9.25Cr)ను వదిలేయాలని అభిప్రాయపడ్డారు. వీరిద్దరినీ వదిలేస్తే పర్స్ ఎక్కువగా మిగులుతుందని, టీమ్ బెంచ్ స్ట్రెంత్‌ను స్ట్రాంగ్ చేసుకోవచ్చన్నారు. అవసరమైతే వారిని మళ్లీ తక్కువ ధరకు మినీ వేలంలో తీసుకునే అవకాశం ఉంటుందని పేర్కొన్నారు.
News November 11, 2025
ఆరా మస్తాన్ సర్వే.. జూబ్లీహిల్స్ కాంగ్రెస్‌దే!

TG: జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో కాంగ్రెస్ పార్టీదే గెలుపు అని ఆరా మస్తాన్ ఎగ్జిట్ పోల్ సర్వే వెల్లడించింది. కాంగ్రెస్‌కు 47.49%, BRSకు 39.25%, BJPకి 9.31% ఓట్లు పోలయ్యే అవకాశం ఉందని వెల్లడించింది. చాణక్య స్ట్రాటజీస్, స్మార్ట్ పోల్, నాగన్న సర్వే తదితర ఎగ్జిట్ పోల్స్ సైతం హస్తం పార్టీ గెలుస్తుందని అంచనా వేశాయి. మరి మీరు ఏ పార్టీ విజయం సాధిస్తుందని భావిస్తున్నారు. కామెంట్ చేయండి.
News November 11, 2025
హజ్ యాత్రికులకు రూ.లక్ష సాయం: సీఎం చంద్రబాబు

AP: వక్ఫ్ బోర్డు ఆస్తులను పరిరక్షిస్తామని సీఎం చంద్రబాబు చెప్పారు. విజయవాడలో నిర్వహించిన మైనారిటీ సంక్షేమ దినోత్సవంలో ఆయన పాల్గొన్నారు. ఉర్దూ భాషాభివృద్ధికి కృషి చేసిన వారికి అవార్డులను ప్రదానం చేశారు. అనంతరం మాట్లాడుతూ హజ్ యాత్రికులకు రూ.లక్ష చొప్పున సాయం చేస్తామని ప్రకటించారు. కడప, విజయవాడలో హజ్ భవనాలను నిర్మిస్తామని హామీ ఇచ్చారు. మైనారిటీల అభివృద్ధికి అండగా ఉంటామన్నారు.


