News March 22, 2025
ఇప్పుడే రిజిస్టర్ చేసుకోండి: ఏపీ స్టేట్ క్రియేటివిటీ&కల్చర్ కమిషన్

విజయవాడ: కళాకారులను ప్రోత్సహించేందుకు నిర్వహిస్తున్న “అమరావతి చిత్రకళావీధి” కార్యక్రమం కోసం ఆసక్తి ఉన్నవారు రిజిస్టర్ చేసుకోవాలని ఏపీ స్టేట్ క్రియేటివిటీ & కల్చర్ కమిషన్ ఛైర్‌పర్సన్ పి. తేజస్వి కోరారు. ఈ మేరకు ఆమె శనివారం ఓ ప్రకటన విడుదల చేశారు. ఏప్రిల్ 4న రాజమండ్రిలో జరిగే ఈ కార్యక్రమం కోసం కళాకారులు https://www.amaravathiartfestival.com/లో రిజిస్టర్ చేసుకోవాలని ఆమె విజ్ఞప్తి చేశారు.
Similar News
News March 25, 2025
యువకుడి ప్రాణాలు తీసిన డేటింగ్ యాప్

మణుగూరు మండలంలో సోమవారం<<15868447>> ఉరివేసుకుని యువకుడు<<>> ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. వాసవీనగర్‌కి చెందిన సుగ్గుల కార్తీక్ డిగ్రీ వరకు చదువుకున్నాడు. డేటింగ్ ఫ్రెండ్ యాప్‌లో ఓ యువతితో పరిచయం పెంచుకుని ప్రేమించాడు. చివరకు ఆమె అతడి ప్రేమను నిరాకరించడంతో ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరివేసుకుని సూసైడ్ చేసుకున్నాడు. తండ్రి సుదర్శన్ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
News March 25, 2025
జగిత్యాల జిల్లాలో తగ్గిన ఎండ తీవ్రత

జగిత్యాల జిల్లాలో ఎండ తీవ్రత కాస్త తగ్గింది. సోమవారం సారంగాపూర్లో 37.6℃ఉష్ణోగ్రత నమోదైంది. అటు మల్లాపూర్లో 37.5℃, జైన 37.4, మేడిపల్లి 37.3, మారేడుపల్లి, రాయికల్, గోదూర్ 37.2, వెల్గటూర్, సిరికొండ 37.1, మన్నెగూడెం 37, కథలాపూర్ 36.9, నేరెల్ల 36.6, ఐలాపూర్, గుల్లకోట, అల్లీపూర్ 36.5, పెగడపల్లి, కొల్వాయి 36.3, గొల్లపల్లిలో 36.2℃ ఉష్ణోగ్రత నమోదైంది. మిగతా ప్రాంతాల్లోనూ ఎండ తీవ్రత తక్కువగానే ఉంది.
News March 25, 2025
పాలమూరుకు మరో మంత్రి పదవి..!

పాలమూరు జిల్లాకు మరో మంత్రి రానుందని టాక్. మక్తల్ MLA వాకిటి శ్రీహరి ముదిరాజ్‌కు మంత్రి పదవి దాదాపు ఖాయమైందని తెలుస్తోంది. సోమవారం ఢిల్లీలో పార్టీ అధిష్ఠానంతో చర్చ అనంతరం మంత్రివర్గ విస్తరణ అంశం ఓ కొలిక్కి వచ్చింది. మార్చి30న ఉగాది పండగ రోజు కొత్త మంత్రులు రానున్నారు.కాగా ఉమ్మడి MBNR నుంచి CM రేవంత్ రెడ్డి (కొడంగల్), జూపల్లి కృష్ణారావు (కొల్లాపూర్) మంత్రులుగా ఉండగా శ్రీహరితో ఆ సంఖ్య 3కు చేరనుంది.