News March 28, 2025

ఇఫ్తార్ విందులో ఆనం, అజీజ్‌, కోటంరెడ్డి

image

రంజాన్ మాసాన్ని పుర‌స్క‌రించుకొని మైనార్టీ సంక్షేమ శాఖ ఆధ్వ‌ర్యంలో క‌స్తూరిదేవి గార్డెన్స్‌లో శుక్రవారం‌ రాత్రి ఇఫ్తార్ విందు ఏర్పాటు చేశారు. ఈ కార్య‌క్ర‌మంలో మంత్రి ఆనం, వ‌క్ఫ్ బోర్డ్ ఛైర్మ‌న్ అజీజ్‌, నుడా ఛైర్మ‌న్ కోటంరెడ్డి, క‌లెక్ట‌ర్ ఆనంద్, కమిషనర్ తోపాటు ముఖ్య నేత‌లు, అధికారులు పాల్గొన్నారు.  వారు ముస్లిం సోద‌రుల‌తో క‌లిసి ప్ర‌త్యేక ప్రార్ధ‌న‌లు చేశారు.

Similar News

News March 31, 2025

నెల్లూరు: కాకాణి విచారణకు వస్తారా?

image

మాజీ మంత్రి కాకాణి గోవ‌ర్ధ‌న్ రెడ్డిపై ఇటీవ‌ల పలు కేసులు న‌మోదైన విష‌యం తెలిసిందే. కాకాణికి నోటీసులు అంద‌చేసేందుకు పొద‌ల‌కూరు పోలీసులు ఆదివారం ఆయ‌న నివాసానికి చేరుకున్నారు. ఆయన అందుబాటులో లేకపోవడంతో ఇంటి గేటుకి నోటీసులు అంటించారు. ఇవాళ ఉదయం 11 గంటలకు విచారణకు రావాలని నోటీసుల్లో పేర్కొన్నారు.. ఆయన విచారణకు వస్తారా లేదా అని జిల్లాలో ఉత్కంఠ నెల‌కొంది.

News March 31, 2025

సైదాపురం ఎంపీడీవోకు తప్పిన ప్రాణాపాయం

image

మనుబోలు జాతీయ రహదారిపై ఆదివారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో సైదాపురం ఎంపీడీవో పురుషోత్తం శివ కుమార్‌కు ప్రాణాపాయం తప్పింది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. గూడూరు ప్రయాణిస్తున్న కారును నెల్లూరు వైపు వెళ్తున్న ఆర్టీసీ బస్సు వేగంగా ఢీకొంది. ఈ ప్రమాదంలో ఎంపీడీవోకు స్వల్ప గాయాలు కాగా సమాచారం అందుకున్న మనుబోలు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేస్తున్నారు.

News March 31, 2025

నెల్లూరు: ఏప్రిల్ 2 నుంచి రిజిస్ట్రేషన్ స్లాట్ పద్ధతి ప్రారంభం

image

ఏప్రిల్ రెండవ తేదీ నెల్లూరు జిల్లా రిజిస్ట్రేషన్ కార్యాలయంలో రిజిస్ట్రేషన్ స్లాట్ బుకింగ్ పద్ధతిని ప్రారంభిస్తున్నట్లు జిల్లా రిజిస్ట్రార్ బాలాంజనేయులు తెలిపారు. ఆర్థిక లావాదేవీలు రిజిస్ట్రేషన్ ప్రక్రియలో నిర్దేశించిన సమయానికి రిజిస్ట్రేషన్ చేసుకునే సౌలభ్యాన్ని ప్రభుత్వం కల్పించిందన్నారు. ఏప్రిల్ నెలాఖరులోగా ఈ పద్ధతిని అమలు చేయనున్నట్లు తెలిపారు.

error: Content is protected !!