News March 28, 2025
ఇఫ్తార్ విందులో పాల్గొన్న బాపట్ల జిల్లా కలెక్టర్

మతసామరస్యానికి ప్రతీక ముస్లిం మతం అని బాపట్ల జిల్లా కలెక్టర్ జె. వెంకట మురళి అన్నారు. గురువారం సాయంత్రం బాపట్ల పట్టణంలోని కాపు కళ్యాణ మండపంలో జిల్లా మైనారిటీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన ఇఫ్తార్ విందు కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ జె. వెంకట మురళి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ముస్లిం సోదరులకు రంజాన్ శుభాకాంక్షలు తెలియజేశారు.
Similar News
News December 21, 2025
పంటలకు అధిక తేమ ముప్పు తప్పాలంటే?

నీరు నిల్వ ఉండే భూమి కాకుండా ఇసుక మిశ్రమంగల భూములను ఎంచుకోవాలి. పంట మొక్కల మధ్య తగిన దూరం ఉండాలి. దీని వల్ల గాలి, వెలుతురు ప్రసరించి తేమ సమస్య తగ్గుతుంది. పొలాలకు తప్పనిసరిగా మురుగునీరు బయటకు పోయే కాల్వలు ఏర్పాటు చేసుకోవాలి. భారీ వర్షాల సమయంలో ఇది ఎంతో మేలు చేస్తుంది. సేంద్రియ ఎరువుల వాడకంతో నేల నిర్మాణం మారుతుంది. ప్లాస్టిక్ లేదా సేంద్రియ మల్చింగ్ ద్వారా తేమను నియంత్రించవచ్చు.
News December 21, 2025
తాడేపల్లిలో జగన్ ఫ్లెక్సీ చింపివేత..!

మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి జన్మదినం సందర్భంగా ఉండవల్లి మెయిన్ బజార్, ఎస్సీ కాలనీల్లో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను గుర్తుతెలియని వ్యక్తులు చింపివేశారు. ఈ ఘటనపై స్థానిక వైసీపీ నాయకులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రశాంతంగా ఉన్న ప్రాంతంలో కావాలనే ఇలాంటి దుశ్చర్యలకు పాల్పడి అలజడి సృష్టిస్తున్నారని వారు మండిపడ్డారు. బాధ్యులపై వెంటనే విచారణ జరిపి కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
News December 21, 2025
రేపే చిత్తూరులో లీప్ టీచర్స్ టోర్నీ

చిత్తూరు మోసానికల్ మైదానంలో ఈనెల 22న లీప్ టీచర్స్ టోర్నమెంట్ నిర్వహిస్తామని డీఈవో రాజేంద్రప్రసాద్, స్కూల్ గేమ్స్ సెక్రటరీ బాబు తెలిపారు. ఇందులో భాగంగా క్రికెట్ పోటీల్లో పురుషుల విభాగంలో పలమనేరు, చిత్తూరు, కుప్పం, నగరి, త్రోబాల్ మహిళా విభాగంలో కుప్పం, నగరి, పలమనేరు, చిత్తూరు జట్లు పాల్గొంటాయని చెప్పారు.


