News December 12, 2025

ఇబ్రహీంపట్నం: ఉత్కంఠకు తెర.. సర్పంచ్‌‌గా గోపి గెలుపు

image

ఇబ్రహీంపట్నం గ్రామ సర్పంచ్ ఫలితంపై కొనసాగిన తీవ్ర ఉత్కంఠకు తెరపడింది. ఇబ్రహీంపట్నం గ్రామ సర్పంచ్‌గా బద్దం గోపి విజయం సాధించారు. గోపి తన సమీప అభ్యర్థి పిట్టల వంశీపై 474ఓట్ల తేడాతో విజయం సాధించారు.

Similar News

News December 15, 2025

BREAKING చల్లపల్లిలో కారు బీభత్సం.. వ్యక్తి మృతి

image

చల్లపల్లిలో కారు బీభత్సం సృష్టించింది. స్థానికుల వివరాల మేరకు.. పోలీస్ స్టేషన్ బజార్లో కారు అదుపు తప్పి జనం మీదకి కారు దూసుకెళ్లింది. రోడ్డుపై ప్రయాణిస్తున్న ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టగా, వాహనదారుడు అక్కడికక్కడే మృతి చెందాడు. మరో ముగ్గురుకి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను 108లో స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఓ వ్యక్తి పరిస్థితి విషమంగా ఉండడంతో మచిలీపట్నం ప్రభుత్వాసుపత్రికి తరలించారు.

News December 15, 2025

కడప: డాక్టరేట్ అందుకున్న అధ్యాపకుడు

image

కడప డాక్టర్ వైఎస్ఆర్ ఆర్కిటెక్చర్ అండ్ ఫైన్ ఆర్ట్స్ యూనివర్సిటీకి చెందిన యానిమేషన్ విభాగం అధ్యాపకుడు డా.ఉండేల శివకృష్ణా రెడ్డి డాక్టరేట్ అందుకున్నారు. చెన్నైలోని హిందుస్థాన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజినీరింగ్ విభాగం నుంచి డాక్టరేట్ పట్టా పొందారు. ఆర్కిటెక్చర్ యూనివర్సిటీ వైస్ చాన్సలర్ ఆచార్య బి.జయరామిరెడ్డి పట్టా అందజేసి అభినందించారు.

News December 15, 2025

కర్నూలు: అంగన్వాడీలకు ఫోన్లు ఇచ్చిన కలెక్టర్

image

కర్నూలు జిల్లా కలెక్టర్ డాక్టర్ సిరి అంగన్వాడీ సిబ్బందికి శాంసంగ్ 5-జీ సెల్‌ఫోన్లు పంపిణీ చేశారు. సోమవారం కలెక్టర్‌ చాంబర్‌లో జరిగిన కార్యక్రమంలో భాగంగా ఈ ఫోన్లను అందజేశారు. అంగన్వాడీ సేవలను మరింత సమర్థవంతంగా నిర్వహించేందుకు ఈ ఫోన్లు ఉపయోగపడతాయని కలెక్టర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో సంబంధిత అధికారులు, అంగన్వాడీ సిబ్బంది పాల్గొన్నారు.