News August 20, 2025
ఇబ్రహీంపట్నం: దంపతుల అదృశ్యం.. కేసు నమోదు

ఇబ్రహీంపట్నం మండల కేంద్రానికి చెందిన బోడ రవి(50), బోడ ప్రమీల(45) అనే దంపతులిద్దరూ అదృశ్యమైనట్లు ఎస్సై అనిల్ బుధవారం తెలిపారు. ఈనెల 16న ఇంట్లో నుండి వెళ్లినవారు ఇంతవరకు ఇంటికి తిరిగి రాలేదని వారి కూతురు అంబటి మీనాక్షి ఇచ్చిన ఫిర్యాదు మేరకు మిస్సింగ్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు వివరించారు. వారి ఆచూకీ తెలిస్తే పోలీసులకు సమాచారం అందించాలని కోరారు.
Similar News
News August 21, 2025
పుట్టినరోజు శుభాకాంక్షలు

ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపర్చండి.
News August 21, 2025
ఈనెల 25 నుంచి కొత్త స్మార్ట్ రేషన్ కార్డులు పంపిణీ

అనకాపల్లి జిల్లాలో ఈనెల 25 నుంచి కొత్త స్మార్ట్ రేషన్ కార్డులు పంపిణీకి ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ విజయకృష్ణన్ ఆదేశించారు. బుధవారం వివిధ శాఖల అధికారులతో పీజీఆర్ఎస్ అర్జీలు, భూములు క్రమబద్ధీకరణ, అన్నదాత సుఖీభవ, నీటి తీరువా వసూళ్లు, తదితర అంశాలపై వీడియో కాన్ఫెరెన్స్ నిర్వహించారు. ఇళ్ల స్థలాల కోసం వచ్చే దరఖాస్తులను ఎప్పటికప్పుడు అప్లోడ్ చేయాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో జేసీ జాహ్నవి పాల్గొన్నారు.
News August 21, 2025
ఇరిగేషన్ పనుల్లో నాణ్యత ముఖ్యం: కలెక్టర్

నీటి కాలువల్లో పూడికతీత, జంగిల్ క్లియరెన్స్ పనుల్లో నాణ్యత ముఖ్యమని కలెక్టర్ తమీమ్ అన్సారియా స్పష్టం చేశారు. ఇరిగేషన్ అధికారులతో బుధవారం ఒంగోలు క్యాంపు కార్యాలయంలో ఆమె ప్రత్యేక సమావేశం నిర్వహించారు. జిల్లాలో వివిధ నీటి కాలువల్లో జరుగుతున్న ఈ పనులలో పురోగతిపై ఆమె సమీక్షించారు. నాగార్జునసాగర్, రామతీర్థం, మోపాడు, కంభం చెరువుల నుంచి నీళ్లు సరఫరా అయ్యే కాలువల పనుల పురోగతిని కలెక్టర్ ఆరా తీశారు.