News March 8, 2025

ఇమాంపేట వసతిగృహ సంక్షేమ అధికారిపై వేటు

image

ఇమాంపేట షెడ్యూల్డ్ కులాల సంక్షేమ అధికారిగా అదనపు బాధ్యతలు నిర్వహిస్తున్న జలగం వెంకటేశ్వర్లును కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ సస్పెండ్ చేశారు. హాస్టల్ నిర్వహణలో లోపాలు, మెనూ పాటించకపోవడం, విధులకు డుమ్మా కొడుతుండడంతో చర్యలు తీసుకున్నట్లు కలెక్టర్ తెలిపారు. జిల్లాలో ఏ హాస్టల్‌లో అయిన మెనూ పాటించకపోతే చర్యలుంటాయని హెచ్చరించారు. 

Similar News

News February 22, 2026

కరెంటు సమస్యలా? ఈ నంబర్‌కు HI అని మెసేజ్ చేయండి

image

TGSPDCL వాట్సాప్ చాట్‌బోట్‌ను లాంచ్ చేసింది. 8712441912 నంబర్‌కు HI అని మెసేజ్ చేసి పలు సర్వీసులను పొందవచ్చు. కంప్లైంట్స్‌ రిజిస్టర్, కంప్లైంట్ ట్రాక్, బిల్ వివరాలు, పవర్ సప్లై స్టేటస్ వివరాలను సులభంగా తెలుసుకోవచ్చు. అలాగే సమస్యపై ఏజెంట్‌తో చాట్ చేయొచ్చు. 24/7 ఈ సర్వీసు అందుబాటులో ఉంటుంది.
#ShareIt

News February 22, 2026

పార్వతీపురం: PGRS అర్జీల వివరాల ‘మీ కోసం’

image

ప్రజా సమస్యల పరిష్కార వేదికలో అర్జీల వివరాలు ‘మీ కోసం’ వెబ్‌సైట్‌లో నమోదు చేయవచ్చని కలెక్టర్ డా.ఎన్.ప్రభాకర రెడ్డి తెలిపారు. సమర్పించిన అర్జీల స్థాయిని 1100 టోల్ ఫ్రీ నంబరుకు ఫోన్ చేసి వివరాలు తెలుసుకోవచ్చని కలెక్టర్ చెప్పారు. ఈ మేరకు ఆదివారం ఒక ప్రకటన విడుదల చేశారు. అన్ని కార్యాలయాల్లో ప్రజల సమస్యలు సోమవారం స్వీకరిస్తామన్నారు.

News February 22, 2026

మెంటేవారితోట: 1,000 పెన్నులతో బాల త్రిపుర సుందరికి అలంకరణ

image

ఇంటర్ మీడియట్ పరీక్షల్లో భాగంగా భీమవరం మెంటేవారితోటలోని శ్రీబాలత్రిపుర సుందరిదేవి అమ్మవారికి 1,000 పెన్నులతో ఆదివారం ప్రత్యేక అలంకరణ చేశారు. ఆలయ అభివృద్ధి కమిటీ అధ్వర్యంలో దాతల సహకారంతో ఆలయ అర్చకుడు శ్రీనివాస్ అమ్మవారికి కుంకుమ పూజలు, అభిషేకాలు చేశారు. అనంతరం 1,000 పెన్నులతో అమ్మవారిని అలంకరించారు. ఈ పెన్నులను విద్యార్థులకు అందజేస్తామని ఆలయ కమిటీ తెలిపింది.