News January 13, 2026

ఇరాన్‌తో వ్యాపారం చేస్తే 25% టారిఫ్: ట్రంప్

image

ఇరాన్‌తో ఉద్రిక్తతల వేళ ఆ దేశాన్ని ఆర్థికంగా దెబ్బకొట్టేందుకు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కొత్త పథకం రచించారు. ఇరాన్‌తో వ్యాపారం చేయకుండా కొత్త టారిఫ్స్ తీసుకొచ్చారు. ఏ దేశాలైతే ఇరాన్‌తో వ్యాపారం చేస్తాయో.. అవి USతో బిజినెస్ చేయాలంటే 25% టారిఫ్స్ చెల్లించాల్సి ఉంటుంది అని ప్రకటించారు. ఈ నిర్ణయం ఇప్పుడే అమలులోకి వస్తుందని చెప్పారు. ఇది ఫైనల్ అంటూ కుండ బద్దలు కొట్టేశారు.

Similar News

News February 16, 2026

తుస్సుమన్న పాకిస్థాన్.. ‘రైవల్రీ ఎక్కడ సర్?’

image

T20 WCలో భారత్‌తో మ్యాచ్‌లో పాక్ తేలిపోయిన విషయం తెలిసిందే. ఇండియా ఏకపక్ష విజయం సాధించింది. ఈ నేపథ్యంలో ‘గ్రేటెస్ట్ రైవల్రీ’ ఎక్కడని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. ‘సర్.. ఇండియా, పాక్ మ్యాచ్‌ను రైవల్రీ(పోటీ/వైరం) అని పిలవకండి. 2 జట్లు 15 మ్యాచులు ఆడి, చెరో 7 లేదా 8‌‌‌‌-7 గెలిస్తే దాన్ని రైవల్రీ అనొచ్చు. కానీ ఇక్కడ <<19154130>>పోటీనే లేదు<<>>’ అంటూ మీడియాతో సూర్య చేసిన వ్యాఖ్యలను గుర్తుచేస్తున్నారు. మరి మీరేమంటారు?

News February 16, 2026

ఎక్ససైజ్ చేసినా బరువు తగ్గడం లేదా?

image

జిమ్‌లో కసరత్తులు, డైలీ జాగింగ్ చేసినా బరువు తగ్గడం లేదని చాలా మంది మదనపడుతుంటారు. అయితే క్యాలరీలను అతిగా బర్న్ చేశామని భావించడం, వ్యాయామం తర్వాత ఎక్కువగా తినడం దీనికి కారణం కావచ్చని డైటీషియన్లు అంటున్నారు. ‘ఎక్ససైజ్ చేస్తున్నామని రోజువారీ దినచర్యపై నిర్లక్ష్యం వహించడం, సరిగ్గా నిద్రపోకపోవడం కూడా కారణం కావచ్చు. జిమ్‌తోపాటు క్రమశిక్షణ ముఖ్యం. కఠిన డైట్ కొనసాగించాలి’ అని సూచిస్తున్నారు.

News February 16, 2026

మున్సిపోల్స్: మేయర్లు, ఛైర్‌పర్సన్ల ఎన్నిక నేడే

image

TG: రాష్ట్రంలోని 116 మున్సిపాలిటీల ఛైర్‌పర్సన్లు, వైస్ ఛైర్‌పర్సన్లు, 7 కార్పొరేషన్ల మేయర్లు, డిప్యూటీ మేయర్ల ఎన్నిక ఇవాళ జరగనుంది. <<19147238>>కరీంనగర్ మినహా<<>> మిగతా కార్పొరేషన్లన్నీ కాంగ్రెస్‌కే దక్కే అవకాశముంది. మరోవైపు 60కి పైగా మున్సిపాలిటీలను ఆ పార్టీ ఇప్పటికే కైవసం చేసుకుంది. ఈ క్రమంలో హంగ్ ఏర్పడిన చోట ఏం జరుగుతుందనేది ఆసక్తికరంగా మారింది. ఇక్కడ ఇండిపెండెంట్లు కీలకంగా మారారు.