News February 14, 2026
ఇరాన్‌లో అధికార మార్పిడే కరెక్ట్: ట్రంప్ సంచలన వ్యాఖ్యలు!

ఇరాన్‌లో పాలన మారడమే ప్రపంచానికి మంచిదని ట్రంప్ వ్యాఖ్యానించారు. ఇరాన్‌పై సైనిక చర్యకు సన్నద్ధమవుతూ ఇప్పటికే USS అబ్రహం లింకన్ యుద్ధనౌకను అమెరికా పంపింది. ఇప్పుడు ప్రపంచంలోనే అతిపెద్ద ఎయిర్‌క్రాఫ్ట్ క్యారియర్ USS జెరాల్డ్ ఆర్.ఫోర్డ్‌ను కూడా అక్కడికి పంపుతోంది. ‘చర్చలు విఫలమైతే యుద్ధం తప్పదు’ అనే సంకేతాలిస్తూ ట్రంప్ ఈ నిర్ణయం తీసుకోవడం మిడిల్ ఈస్ట్ దేశాలకు ఆందోళన కలిగిస్తోంది.
Similar News
News February 14, 2026
అకౌంట్‌లో ఉన్న డబ్బుతో వడ్డీ పొందొచ్చు!

రిస్క్ లేకుండా అకౌంట్‌లో ఉన్న డబ్బుతో వడ్డీ పొందవచ్చు. మల్టీ ఆప్షన్ డిపాజిట్ స్కీమ్ (MODS) ద్వారా సేవింగ్స్ అకౌంట్‌లో నిర్ణీత పరిమితి దాటిన డబ్బు ఆటోమేటిక్‌గా FDగా మారుతుంది. అవసరమైనప్పుడు ఆ డబ్బును ఎప్పుడైనా విత్ డ్రా చేసుకోవచ్చు. మిగిలిన మొత్తంపై వడ్డీ కొనసాగుతుంది. తక్కువ రిస్క్‌తో ఎక్కువ వడ్డీ వస్తుంది. చాలా బ్యాంకుల్లోనూ ఈ సౌకర్యం ఉన్నప్పటికీ లిమిట్‌లో తేడాలున్నాయి. SHARE IT
News February 14, 2026
చేతులు మెరిసేలా..

కొందరిలో ముఖం ప్రకాశవంతంగానే ఉన్నా.. చేతులు మాత్రం జీవం కోల్పోయినట్లుగా తయారవుతాయి. దీనికోసం ఉప్పుతో తయారుచేసిన స్క్రబ్‌ని ఉపయోగిస్తే మంచి ఫలితం కనిపిస్తుంది. కొద్దిగా ఉప్పులో లావెండర్ నూనె కలిపి దాన్ని చేతులకు రాసుకోవాలి. పదినిమిషాల తర్వాత మృదువుగా రుద్దుతూ క్లీన్ చేసుకోవాలి. ఈ చిట్కాను వారానికి రెండుసార్లు పాటిస్తే చేతులపై చేరిన మృతకణాలు, మురికి తొలగిపోయి మృదువుగా మారతాయి.
News February 14, 2026
స్కాట్లాండ్‌పై ఇంగ్లండ్ విజయం

T20WC: కోల్‌కతా వేదికగా స్కాట్లాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో ఇంగ్లండ్ జట్టు విజయం సాధించింది. 153 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన బ్రిటిష్ జట్టు తొలుత వెంటవెంటనే వికెట్లు కోల్పోయింది. 86కే 4 వికెట్లు పడిన సమయంలో స్కాట్లాండ్ పైచేయి సాధించినట్లే కన్పించింది. ఆపై ఇంగ్లండ్ బ్యాటర్లు వరుసగా బౌండరీలు బాదుతూ విజయం వైపు నడిచారు. 18.2 ఓవర్లలోనే టార్గెట్ ఛేదించారు. బ్యాంటన్ 41 బంతుల్లోనే 63 పరుగులతో రాణించారు.


