News January 12, 2026

ఇరాన్‌లో ఇండియన్స్ అరెస్ట్.. స్పందించిన ఆ దేశ రాయబారి

image

ఇరాన్‌లో జరుగుతున్న ప్రభుత్వ వ్యతిరేక <<18832503>>అల్లర్లలో<<>> ఇండియన్స్‌ని అక్కడి పోలీసులు అరెస్టు చేశారన్న వార్తల్ని భారత్‌లోని ఆ దేశ రాయబారి మహమ్మద్ ఫథాలీ ఖండించారు. వివిధ సోషల్ మీడియా ఖాతాల్లో సర్క్యులేట్ అవుతున్న వార్తలు అవాస్తవమని తెలిపారు. ఇరాన్‌కు సంబంధించిన అప్‌డేట్స్ కోసం అధికారిక ప్రకటనలపైనే ఆధారపడాలని సూచించారు.

Similar News

News February 12, 2026

రేపు వైన్ షాపులు బంద్

image

TG: రేపు ఎన్నికల కౌంటింగ్ జరగనున్న కార్పొరేషన్లు, మున్సిపాలిటీల పరిధిలో వైన్ షాపులు బంద్ కానున్నాయి. ఉ.6 గంటల నుంచి కౌంటింగ్ ప్రక్రియ ముగిసేవరకూ మద్యం షాపులు మూసివేయాలని అధికారులు ఆదేశించారు. రేపు ఉ.8 గంటలకు కౌంటింగ్ ప్రక్రియ మొదలవుతుంది.

News February 12, 2026

85% చూపు కోల్పోయిన ఇమ్రాన్ ఖాన్!

image

పాక్ మాజీ PM ఇమ్రాన్ ఖాన్ కంటి చూపు మందగించింది. ఆయన కుడి కన్ను 85% విజన్ కోల్పోయిందని సుప్రీంకోర్టు నియమించిన లాయర్ తెలిపారు. 3 నెలలుగా కంటిచూపు సమస్యతో బాధపడుతున్నా జైలు అధికారులు చికిత్స అందించడం లేదని కోర్టుకు రిపోర్ట్ చేశారు. ఈ నేపథ్యంలో ఇమ్రాన్ ఆరోగ్యంపై మెడికల్ రివ్యూకు సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. అవినీతి ఆరోపణలతో అరెస్టయిన ఇమ్రాన్ 2023 AUG నుంచి జైలులోనే ఉన్నారు.

News February 12, 2026

రేపే మున్సిపల్ రిజల్ట్స్.. Way2Newsలో ఎక్స్‌క్లూజివ్‌గా..

image

7 కార్పొరేషన్లు.. 116 మున్సిపాలిటీలు.. సుమారు 13వేల మంది అభ్యర్థుల భవితవ్యం రేపు తేలిపోనుంది. తెలంగాణ మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్ శుక్రవారం ఉదయం 8 గంటల నుంచి ప్రారంభం కానుంది. మీరెక్కడున్నా సమాచారం మీ ముందు ఉంచేందుకు Way2News సిద్ధంగా ఉంది. ప్రతి వార్డు, డివిజన్‌ ఫలితాలను ఎప్పటికప్పుడు ఎక్స్‌క్లూజివ్‌గా, అతివేగంగా మన యాప్‌లో తెలుసుకోండి.