News January 17, 2026

ఇరాన్‌లో కొత్త ప్రభుత్వం ఏర్పడితే.. భారత్‌కు కష్టమేనా?

image

ఇరాన్‌లో ఏర్పడే కొత్త ప్రభుత్వంలో ఇండియాతో సన్నిహిత సంబంధాలు కోరుకుంటున్నామని యువరాజు రెజా పహ్లావి ప్రకటించారు. కానీ ఆయన తండ్రి షా మహ్మద్ గతంలో పాక్‌కు అనుకూలంగా ఉన్నారు. 1965, 1975 ఇండో-పాక్ యుద్ధాల్లో PAKకు మద్దతు తెలిపారు. ఇప్పుడు పహ్లావికి US సపోర్ట్ ఉంది. పాక్, US బంధం నేపథ్యంలో ఇరాన్ వాటికి తోడైతే మనకు కష్టమే. <<18876732>>చాబహార్ పోర్టు<<>> భవితవ్యంపై నీలినీడలు కమ్ముకునే ప్రమాదముంది.

Similar News

News February 16, 2026

విద్యుత్‌ ‘కట్‘కటా లేకుండా ఏర్పాట్లు

image

TG: ఎల్‌నినో కారణంగా ఈ ఏడాది ఎండలు తీవ్రమై రాష్ట్ర విద్యుత్ డిమాండ్‌ 18000 MW వరకు పెరగొచ్చని ప్రభుత్వం అంచనా వేస్తోంది. గ్రేటర్ HYDలోనే ఈసారి 4000 MW అవసరమని, యాసంగి(ఏప్రిల్, మే)లో సాగుకు వినియోగం పెరుగుతుందని భావిస్తోంది. దీనికి తగ్గట్టుగా యాదాద్రి ప్లాంటులో 4000 MW ఉత్పత్తికి చర్యలు తీసుకుంది. పీక్ అవర్‌లో విద్యుత్ రేట్లు భారీగా ఉన్నా కొనుగోలుకు రెడీ అవుతోంది. 2025లో 17500 MW డిమాండ్ ఉంది.

News February 16, 2026

విశ్వక్‌కు వరుస షాక్‌లు.. రూటు మార్చాల్సిందేనా?

image

ENE, ఫలక్‌నుమాదాస్ లాంటి సినిమాలతో క్రేజ్ తెచ్చుకున్న విశ్వక్‌సేన్‌కు బ్యాడ్ టైమ్ నడుస్తోంది. చాలా కాలంగా హిట్‌కు దూరమైన ఆయనకు తాజాగా రిలీజైన ‘ఫంకీ’ కూడా ఆశించిన ఫలితాన్నివ్వలేదు. అంతకుముందు ‘లైలా’, ‘మెకానిక్ రాకీ’ కూడా ఫెయిలయ్యాయి. దీంతో విశ్వక్‌ సరైన కథలను ఎంపిక చేసుకోవట్లేదన్న విమర్శలొస్తున్నాయి. ప్రస్తుతం చేస్తున్న ‘ENE2’, ‘కల్ట్’ సినిమాలైనా ఆయనకు హిట్ ఇస్తాయేమో చూడాలి.

News February 16, 2026

ఆగ్నేయ మూలలో వాస్తు దోషం ఉంటే?

image

ఆగ్నేయం దోషపూరితంగా ఉంటే కుటుంబంలో అశాంతి నెలకొనే అవకాశం ఉంటుందని వాస్తు నిపుణులు కృష్ణాదిశేషు చెబుతున్నారు. ‘కష్టపడి సంపాదించిన ధనం వృథా అయ్యే ఛాన్సుంది. రావలసిన డబ్బు సమయానికి అందదు. ఇంట్లో మహిళలు మానసిక వేదనకు, అనారోగ్యానికి గురయ్యే ప్రమాదం ఉంది. కుటుంబీకుల మధ్య ఐక్యత లోపించి, నిరంతరం చిన్నపాటి గొడవలు జరుగుతుంటాయి. ఈ స్థలాన్ని వినియోగించుకుంటే చాలా జాగ్రత్తగా ఉండాలి’ అని సూచిస్తున్నారు. <<-se>>#Vasthu<<>>