News January 18, 2026

ఇరాన్‌లో లీడర్‌షిప్ మారాలి: ట్రంప్

image

ఇరాన్‌లో కొత్త నాయకత్వం రావాల్సిన సమయం ఆసన్నమైందని US అధ్యక్షుడు ట్రంప్ అన్నారు. ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీని ‘సిక్ మ్యాన్’గా సంబోధించిన ఆయన దేశాన్ని హింసతో కాకుండా గౌరవంతో నడపాలని హితవు పలికారు. దేశాన్ని సరిగ్గా ఎలా నడపాలో తన నుంచి నేర్చుకోవాలన్నారు. ఇరాన్ నేతల తీరు వల్ల ఆ దేశంలో సాధారణ ప్రజలు నివసించలేని పరిస్థితి నెలకొందన్నారు.

Similar News

News February 1, 2026

ప్రజాకర్షక పథకాల జోలికెళ్లని బడ్జెట్!

image

ఈసారి బడ్జెట్‌లో ప్రజాకర్షక పథకాలు పెద్దగా కనిపించలేదు. ముఖ్యంగా ఈ ఏడాది ఎన్నికలు జరగనున్న రాష్ట్రాలకు ప్యాకేజీలు, ప్రత్యేక పథకాల వంటివేమీ ప్రకటించలేదు. కేవలం కొన్ని మౌలిక వసతుల అభివృద్ధి ప్రాజెక్టులనే కట్టబెట్టారు. వికసిత్ భారత్-2047 లక్ష్యంగా చేపట్టిన ఇనీషియేటివ్స్‌కు కొనసాగింపుగానే చాలా ప్రకటనలు ఉన్నాయి. పన్నుల విషయంలోనూ ఉద్యోగులను ఆకర్షించే పెద్ద అనౌన్స్‌మెంట్స్ లేవని నిపుణులు అంటున్నారు.

News February 1, 2026

అంబటి కుటుంబానికి భద్రత కల్పించాలి: హైకోర్టు

image

AP: మాజీ మంత్రి అంబటి రాంబాబు కుటుంబానికి 24 గంటలూ భద్రత కల్పించాలని హైకోర్టు పోలీసులను ఆదేశించింది. శాంతి భద్రతలు అదుపులోకి వచ్చేంతవరకు దీన్ని కొనసాగించాలని సూచించింది. అంబటి భార్య వేసిన హౌస్ మోషన్ పిటిషన్‌పై కోర్టు ఆదేశాలు జారీచేసింది. అంబటి ఇంటిపై దాడి కేసులో న్యాయస్థానం సీరియస్‌గా స్పందించింది.

News February 1, 2026

ఈసారి ఈ ‘శారీ’

image

బడ్జెట్ ప్రసంగం వేళ FM నిర్మలమ్మ ధరించిన కాంచీపురం చీర ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. స్వచ్ఛమైన మల్బరీ పట్టుతో, వెండి తీగపై బంగారు పూత మెరిసే జరీతో దీనిని రూపొందించారు. కోర్వాయ్ పద్ధతిలో చీర, అంచులను విడివిడిగా నేసి బలంగా జత చేయడం వీటి ప్రత్యేకత. మూడు పట్టు దారాల కలయిక వల్ల ఇవి బరువుగా, దృఢంగా ఉంటాయి. తమిళనాడు ఎన్నికల నేపథ్యంలో అక్కడి సంస్కృతిని ప్రతిబింబించేలా ఈ చీరను ఎంపిక చేశారనే <<19018918>>చర్చ<<>> సాగుతోంది.