News March 1, 2026

ఇరాన్ అగ్రనాయకత్వాన్ని హతం చేశాం: ఇజ్రాయెల్

image

అమెరికాతో కలిసి జరిపిన దాడుల్లో ఇరాన్ అగ్రనాయకులు హతమైనట్లు ఇజ్రాయెల్ ప్రకటించింది. సుప్రీం లీడర్ ఖమేనీ చనిపోయినట్లు ట్రంప్, నెతన్యాహు వెల్లడించారు. రక్షణ మంత్రి అజీజ్, సుప్రీం లీడర్ మిలిటరీ బ్యూరో చీఫ్ షిరాజీ, డిఫెన్స్ కౌన్సిల్ సెక్యూరిటీ అడ్వైజర్ అలీ షంఖానీ, IRGC చీఫ్ మహమ్మద్ పక్‌పౌర్, SPND ఛైర్మన్ హోస్సేన్ జబల్, SPND మాజీ ఛైర్మన్ మొజాఫరీ, అలన్బే కమాండ్ ఇంటెలిజెన్స్ చీఫ్ సలేహ్ అసాదీ హతమయ్యారు.

Similar News

News March 2, 2026

7 ఎమిరేట్స్ సమాఖ్య దేశమే UAE

image

యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ రాజధాని అబుదాబి. <<19276017>>UAE<<>> 7 ఎమిరేట్స్ అబుదాబి, దుబాయ్, షార్జా, అజ్మాన్, ఉమ్ అల్ క్వైన్, రస్ అల్ ఖైమా, ఫుజైరాల సమాఖ్య దేశం. 1971లో 6 ఎమిరేట్స్ ఓ గ్రూపుగా ఏర్పడగా 1972లో ఫుజైరా జాయిన్ అయింది. వీటికి సపరేట్‌గా ఏడుగురు చీఫ్‌లున్నా అబుదాబి అధినేతే UAEకి అధ్యక్షుడిగా ఉంటారు. ఈ దేశ విస్తీర్ణంలో పెద్దదై(84-87%)న అబుదాబి, ప్రపంచంలోనే మోస్ట్ హ్యాపెనింగ్ సిటీ దుబాయ్‌లదే UAEలో ఆధిపత్యం.

News March 2, 2026

రైల్వేలో 22,195 పోస్టులు.. అప్లైకి ఇవాళే లాస్ట్ డేట్

image

రైల్వేలో 22,195 గ్రూప్ డీ పోస్టులకు అప్లై చేయడానికి ఇవాళే ఆఖరు తేదీ. టెన్త్, ఐటీఐ అర్హత గలవారు అప్లై చేసుకోవచ్చు. వయసు 18 నుంచి 33ఏళ్ల మధ్య ఉండాలి. రిజర్వేషన్ గలవారికి ఏజ్‌లో సడలింపు ఉంది. నెలకు జీతం రూ.18వేలు చెల్లిస్తారు. CBT, ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్, DV, మెడికల్ టెస్ట్ ద్వారా ఎంపిక చేస్తారు. దరఖాస్తు ఫీజు రూ.500, SC, ST, PwBD, మహిళలకు రూ.250. వెబ్‌సైట్: https://www.rrbcdg.gov.in/

News March 2, 2026

రేపే చంద్రగ్రహణం.. ఏ టైమ్‌కు మొదలవుతుందంటే?

image

రేపు చంద్రగ్రహణం మధ్యాహ్నం 3.20 గంటలకు ప్రారంభమై సాయంత్రం 6.48 గంటలకు వీడుతుంది. సాయంత్రం గం.4.34 నుంచి 5.33 మధ్య సంపూర్ణ గ్రహణకాలం ఉంటుంది. అయితే భారత్‌లో సాయంత్రం గం.6.20 నుంచి సుమారు 27 నిమిషాలు కనిపిస్తుంది. అండమాన్ దీవులు, ఈశాన్య రాష్ట్రాల్లోని పలు ప్రాంతాలు మినహా దేశంలోని మిగతా చోట్ల సంపూర్ణ చంద్రగ్రహణం కనిపిస్తుంది. ఇక మళ్లీ భారత్‌లో 2028 డిసెంబరు 31న సంపూర్ణ చంద్రగ్రహణం చూడొచ్చు.