News March 18, 2026

ఇరాన్ ఇంటెలిజెన్స్ మంత్రిని చంపేశాం: ఇజ్రాయెల్

image

ఇరాన్ ఇంటెలిజెన్స్ మంత్రి ఇస్మాయిల్ ఖాతిబ్‌ను హతమార్చినట్లు ఇజ్రాయెల్ రక్షణ మంత్రి కట్జ్ ప్రకటించారు. టెహ్రాన్‌పై అర్ధరాత్రి జరిపిన ఎయిర్ స్ట్రైక్‌లో అతడు చనిపోయినట్లు వెల్లడించారు. ప్రధాని నెతన్యాహు ఆదేశాలతో ఇరాన్‌పై దాడులను ఉద్ధృతం చేశామని పేర్కొన్నారు. కాగా వరుసగా టాప్ లీడర్లు మరణిస్తున్నా తాము వెనక్కి తగ్గేదే లేదని ఇరాన్ స్పష్టం చేసింది.

Similar News

News April 5, 2026

వారంలో బంగారం ధర ఎంత పెరిగిందంటే?

image

వారం రోజులుగా బంగారం ధరలు పెరుగుతూనే వస్తున్నాయి. మార్చి 27వ తేదీ నుంచి 10గ్రా. 24 క్యారెట్ల బంగారంపై రూ.5,350 పెరిగింది. 22 క్యారెట్లపై రూ.4,900 పెరుగుదల నమోదైంది. APR 2న మాత్రమే తగ్గుదల కన్పించింది. పశ్చిమాసియా యుద్ధం, ట్రంప్ ప్రకటనలతో స్టాక్ మార్కెట్ల అనిశ్చితి వల్ల బులియన్ మార్కెట్‌పైనా ప్రభావం పడుతోంది. ప్రస్తుతం HYDలో 24 క్యారెట్ల పసిడి 1,50,930, 22 క్యారెట్ల గోల్డ్ రూ.1,38,350గా ఉంది.

News April 5, 2026

2 వారాలు మైదా మానేస్తే?

image

కేవలం 2 వారాలు మైదా పక్కన పెడితే శరీరంలో అద్భుతమైన మార్పులు గమనించొచ్చని నిపుణులు చెబుతున్నారు. మైదా వల్ల వచ్చే షుగర్ స్పైక్స్ తగ్గి రోజంతా ఎనర్జీ లెవల్స్ స్థిరంగా ఉంటాయి. ఇందులో ఫైబర్ ఉండదు. కాబట్టి దీన్ని మానేస్తే జీర్ణక్రియ మెరుగై గ్యాస్, ఉబ్బరం వంటి సమస్యలు రావు. మైదాకు బదులు తృణధాన్యాలు తింటే ఆకలి త్వరగా వేయదు. వెయిట్ లాస్ కూడా ఈజీ అవుతుంది. విటమిన్లు, మెగ్నీషియం పెరిగి చర్మం మెరుస్తుంది.

News April 5, 2026

ఉప్పల్‌లో SRHకు అదిరిపోయే రికార్డులు!

image

IPL: హోంగ్రౌండ్ ఉప్పల్‌లో SRH తన పర్ఫార్మెన్స్‌తో అభిమానులను ఊర్రూతలూగిస్తూనే ఉంటుంది. 2013 నుంచి ఈ గ్రౌండులో ఆ జట్టు 63 మ్యాచులు ఆడగా 38 విజయాలను సొంతం చేసుకుంది. విన్నింగ్ పర్సెంటేజ్ 61కి పైనే ఉంది. మరోవైపు లీగ్‌లో ఇప్పటి వరకు నమోదైన రెండో అత్యధిక స్కోర్(286) గత సీజన్లో RRపై చేసింది. 2025లోనే పంజాబ్ జట్టుపై 247 పరుగులనూ ఛేదించింది. ఇక ఉప్పల్‌లో సెకండ్ బ్యాటింగ్ చేసిన జట్లే 57% గెలవడం గమనార్హం.