News March 9, 2026

ఇరాన్ చరిత్రలో గొప్ప ప్రధాని.. బ్రిటన్, అమెరికా కుట్రలతో..

image

మొహమ్మద్ మొస్సాదేగ్ 1951-53 వరకు ఇరాన్ ప్రధానిగా ఉన్నారు. విద్యావంతుడైన ఈయన ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికయ్యారు. తమ క్రూడాయిల్‌పై బ్రిటన్ ఆధిపత్యం ఉండొద్దని జాతీయం చేశారు. దీంతో ఇరాన్ రాజు మొహమ్మద్ రెజా బ్రిటన్, అమెరికాలతో కలిసి.. ఆయన కమ్యూనిజం వైపు వెళ్తున్నారని, రాజద్రోహానికి పాల్పడ్డారని కుట్రలు మోపారు. దీంతో మొస్సాదేగ్ మూడేళ్లు జైలు జీవితం గడిపారు. మరణించే వరకు (1967) గృహనిర్బంధంలోనే ఉన్నారు.

Similar News

News March 9, 2026

‘పొండాట్టి’ థాంక్యూ.. సంజూ ఎమోషనల్ పోస్ట్!

image

శాంసన్ తన భార్య చారులతపై ఉన్న లవ్‌ను ఇన్‌స్టా వేదికగా పంచుకున్నారు. WC విజయం తర్వాత ఆయన పెట్టిన పోస్ట్ వైరలవుతోంది. ‘పరిచయమైన రోజు నుంచి ఇప్పటి వరకు నాకు తోడుగా నిలిచినందుకు థాంక్యూ పొండాట్టి (భార్య). నా మంచినీ, చెడునీ చూసి కూడా నన్ను నన్నుగా ప్రేమించి నా పక్కనే బలంగా నిలబడ్డావు. నా లైఫ్‌లో క్రికెట్ ఎంత ముఖ్యమో అర్థం చేసుకొని ఈ క్షణం కోసం నాకంటే ఇంటెన్సిటీతో కలలు కన్నావు’ అంటూ ఎమోషనల్ అయ్యారు.

News March 9, 2026

మోదీ ఒక్క ఫోన్ చేస్తే యుద్ధం ఆగుతుంది: UAE రాయబారి

image

ఇజ్రాయెల్, ఇరాన్‌ నేతలకు PM మోదీ ఒక్క ఫోన్ చేస్తే యుద్ధం ఆగుతుందని ఇండియాలో UAE రాయబారి హుస్సేన్ హాసన్ మీర్జా అన్నారు. గల్ఫ్ నేతలే కాకుండా ప్రజలు, బిజినెస్ కమ్యూనిటీల్లోనూ మోదీపై గౌరవం ఉందని చెప్పారు. యుద్ధంలోకి దిగే ఆలోచన తమకు లేదని, UAEని లాంచింగ్ ప్యాడ్‌గా వాడుకునేందుకు అంగీకరించబోమని స్పష్టంచేశారు. ఇరాన్‌ తమ పొరుగు దేశమని, ఇజ్రాయెల్ మిత్రపక్షమని, రెండింటితోనూ చర్చలు జరపగలమని తెలిపారు.

News March 9, 2026

శ్రీలంక కొత్త కోచ్‌గా గ్యారీ కిర్‌స్టెన్

image

శ్రీలంక క్రికెట్ జట్టు కోచ్‌గా సౌతాఫ్రికా మాజీ క్రికెటర్ గ్యారీ కిర్‌స్టెన్ నియమితులయ్యారు. APR 15న ఆయన బాధ్యతలు చేపట్టనున్నారు. టీమ్ ఇండియా 2011 వన్డే ప్రపంచకప్ గెలిచినప్పుడు కిర్‌స్టెన్ కోచ్‌గా ఉన్నారు. 2011-13 వరకు సౌతాఫ్రికా కోచ్‌గా పనిచేశారు. ఆ సమయంలో (2013) సౌతాఫ్రికా మూడు ఫార్మాట్లలో ఐసీసీ నం.1 ర్యాంక్ సాధించింది. కాగా T20WC-2026లో శ్రీలంక సూపర్-8 దశలో ఓడటంతో కోచ్ జయసూర్య రాజీనామా చేశారు.