News June 30, 2024

ఇరిగేషన్ ప్రాజెక్ట్‌పై అధికారులతో అచ్చెన్నాయుడు సమీక్ష

image

జిల్లాలోని వంశధార ఇరిగేషన్ ప్రాజెక్ట్‌పై ఆదివారం సాయంత్రం నరసన్నపేట మండల పరిషత్ కార్యాలయంలో అధికారులతో రాష్ట్ర మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు, కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడులు సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లాలో వంశధార ప్రాజెక్ట్ అంశాలపై ఉన్నతాధికారులతో చర్చించారు. సమావేశంలో కలెక్టర్ మనజీర్ జిలానీ, ఎమ్మెల్యేలు భగ్గు రమణమూర్తి, గౌతు శిరీష, గొండు శంకర్ ఉన్నారు.

Similar News

News July 5, 2024

శ్రీకాకుళం: అధికారులు అంకిత భావంతో పనిచేయాలి

image

అధికారులు అంకిత భావంతో పనిచేయాలని జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ తెలిపారు. శుక్రవారం కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో జిల్లా ఎస్పీ జి.ఆర్. రాధిక, జిల్లా జాయింట్ కలెక్టర్ ఎం.నవీన్‌లతో కలిసి జిల్లా అధికారులతో ఆయన సమావేశం నిర్వహించారు. ప్రభుత్వం సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు అర్హత కలిగిన ప్రతీ లబ్ధిదారునికి అందించే దిశగా అంకితభావంతో విధులు నిర్వహించాలని ఆదేశించారు.

News July 5, 2024

శ్రీకాకుళం: 8 నుంచి ఎయిర్‌ఫోర్స్‌కు దరఖాస్తులు

image

అగ్నివీర్, అగ్నిపథ్ స్కీమ్ కింద ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పని చేయుటకు ఆసక్తి ఉన్న వారు ఈనెల 8 నుంచి 28వ తేదీలోగా ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని పార్వతీపురం మన్యం జిల్లా ఉపాధి అధికారి శుక్రవారం తెలిపారు. అవివాహిత యువత ఇంటర్ లేదా 10వ తరగతిలో 50% మార్కులతో ఉత్తీర్ణులై ఉండాలన్నారు. వివరాలకు https://agnipathvayu.cdac.in వెబ్‌సైట్‌ను సంప్రదించాలని కోరారు.

News July 5, 2024

అమరావతి కోసం తొలి వేతనాన్ని విరాళంగా ఇచ్చిన ఎంపీ కలిశెట్టి

image

అమరావతి అభివృద్ధి కోసం ఎంపీగా అందుకొన్న తొలి గౌరవ వేతనాన్ని విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు శుక్రవారం సీఎం చంద్రబాబుకు అందజేశారు. ఢిల్లీ పర్యటనలో ఉన్న చంద్రబాబును నేడు ఎంపీ కలిశెట్టి మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ మేరకు రూ.1.57 లక్షల చెక్కును ఆయన చంద్రబాబుకు అందజేశారు. దీంతో ఎంపీని సీఎం అభినందించారు.