News December 27, 2025

ఇరిగేషన్ శాఖ సలహాదారుపై BRS గురి!

image

TG: అసెంబ్లీలో పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టుపై చర్చకు ముందు ఇరిగేషన్ సలహాదారు ఆదిత్యనాథ్ దాస్‌పై BRS గురిపెట్టింది. 2014-19 మధ్య CBN పాలనలో AP నీటిపారుదల శాఖ కార్యదర్శిగా ఉన్న ఆయన ఈ ప్రాజెక్టుపై ఫిర్యాదు చేసి పనులను నిలిపివేశారని BRS ఆరోపిస్తోంది. దీంతో కౌంటర్ ఇచ్చేందుకు CM రేవంత్, మంత్రి ఉత్తమ్ సిద్ధమవుతున్నారు. ప్రాజెక్టును నిలిపివేయడంలో ఆదిత్యనాథ్ పాత్రపై ఆరా తీస్తున్నట్లు సమాచారం.

Similar News

News December 30, 2025

టోకెన్లు లేని భక్తులు జనవరి 2 నుంచి రావాలి: టీటీడీ ఈవో

image

AP: వైకుంఠ ద్వారదర్శనాలు ప్రణాళిక ప్రకారం జరుగుతున్నాయని టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్ తెలిపారు. ఈ మూడు రోజులు ఆన్‌లైన లక్కీ డిప్ ద్వారా టోకెన్లు పొందిన భక్తులకు మాత్రమే దర్శనానికి అనుమతి ఇస్తామని చెప్పారు. టోకెన్లు లేని భక్తులు జనవరి 2న నేరుగా రావాలని విజ్ఞప్తి చేశారు. వారికి జనవరి 8 వరకు దర్శనాలకు అనుమతి ఇస్తామని పేర్కొన్నారు.

News December 30, 2025

అరటి పరిమాణం పెంచే ‘బంచ్‌ ఫీడింగ్‌’ మిశ్రమం

image

అరటి కాయల పరిమాణం పెరుగుదలకు భారతీయ ఉద్యాన పరిశోధన సంస్థ బంచ్ ఫీడింగ్ మిశ్రమం రూపొందించింది. 100ml నీటిలో 7.5 గ్రా. నత్రజని ఎరువు, 7.5 గ్రాముల పొటాష్‌ ఎరువు కలపాలి. ఆ తర్వాత ఈ మిశ్రమాన్ని 500 గ్రాముల పేడలో బాగా కలపాలి. అనంతరం ఈ మిశ్రమాన్ని పైన ఫొటోలో చూపినట్లు కాయలు కాసిన తర్వాత క్రింది పువ్వును కత్తిరించి, ఆ మిశ్రమం ఉన్న పాలిథిన్‌ సంచిలో కాయలు కాసిన కాడకు ఒక అడుగు దూరం వదిలి గట్టిగా కట్టాలి.

News December 30, 2025

రైల్వేలో 311 పోస్టులు.. నేటి నుంచి దరఖాస్తుల ఆహ్వానం

image

<>RRB <<>>ఐసోలేటెడ్ కేటగిరీలో 311 పోస్టుల భర్తీకి నేటి నుంచి దరఖాస్తులు స్వీకరించనుంది. పోస్టును బట్టి ఇంటర్, డిగ్రీ, LLB, MBA, డిప్లొమా, పీజీ(సైకాలజీ) ఉత్తీర్ణులైన అభ్యర్థులు జనవరి 29 వరకు అప్లై చేసుకోవచ్చు. సీబీటీ, స్టెనోగ్రఫీ స్కిల్ టెస్ట్/అనువాద పరీక్ష, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ టెస్ట్ ఆధారంగా ఎంపిక చేస్తారు. వెబ్‌సైట్: https://www.rrbcdg.gov.in