News January 5, 2026

ఇరుసుమండ ఘటనపై సీఎం చంద్రబాబు ఆరా!

image

ఇరుసుమండలో సంభవించిన గ్యాస్ లీకేజీ, <<18769737>>మంటల <<>>ఉద్ధృతిపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పందించారు. అధికారులతో సమీక్ష నిర్వహించి, మోరి-5 బావి వద్ద మంటలను అదుపు చేసేందుకు తక్షణ చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ప్రజలకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించాలని సూచించారు. అధికారులు సమన్వయంతో పనిచేయాలని, ఈ ప్రమాదంపై సమగ్ర నివేదికను తనకు త్వరగా అందజేయాలని ముఖ్యమంత్రి ఆదేశాలు జారీ చేశారు.

Similar News

News January 7, 2026

పాడిపై చలిపంజా: తగ్గుతున్న పాల ఉత్పత్తి!

image

ఉమ్మడి నల్గొండ జిల్లాలో చలి తీవ్రత పాడి పరిశ్రమపై పెను ప్రభావం చూపుతోంది. డిసెంబర్ నుంచి చలి పెరగడంతో పాల ఉత్పత్తి గణనీయంగా తగ్గుతోందని రైతులు ఆవేదన చెందుతున్నారు. జిల్లావ్యాప్తంగా 15 లక్షల పశువులు ఉండగా, 5 లక్షల పశువుల ద్వారా రోజుకు 25 లక్షల లీటర్ల పాలు ఉత్పత్తి అవుతున్నాయి. ప్రస్తుతం చలి కారణంగా లీటర్ల కొద్దీ దిగుబడి తగ్గి, పాడి రైతులు ఆర్థికంగా నష్టపోతున్నారు.

News January 7, 2026

MBNR: SSC, INTER.. ఫీజు చెల్లించండి

image

ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలోని ఓపెన్ SSC, INTERలో చేరే విద్యార్థులు ఎగ్జామ్ ఫీ చెల్లించాలని ఉమ్మడి జిల్లా ఓపెన్ స్కూల్(TOSS) కో-ఆర్డినేటర్ శివయ్య తెలిపారు. ఈ నెల 16లోగా(ఫైన్‌తో) ఎగ్జామ్ ఫీ ఆన్లైన్‌లో చెల్లించాలని, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. పూర్తి వివరాలకు www.telanganaopenschool.org వెబ్ సైట్‌లో సందర్శించాలన్నారు.
#SHARE IT

News January 7, 2026

MBNR: T20 లీగ్.. పాలమూరు విజయం

image

HCA ఆధ్వర్యంలో నిర్వహించిన ‘T20 కాకా స్మారక క్రికెట్ లీగ్’లో పాలమూరు ఘన విజయం సాధించింది. సిద్దిపేటలో జరిగిన మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన WGL జట్టు 20 ఓవర్లలో 142/7 పరుగులు చేసింది. MBNR జట్టు 19.2 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. MBNR జట్టు ఆటగాడు అబ్దుల్ రాఫె-79* పరుగులు చేసి ‘మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్’ గా నిలిచాడు. వారిని MDCA ప్రధాన కార్యదర్శి రాజశేఖ్, కోచ్‌లు అభినందించారు.